Begin typing your search above and press return to search.

30 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఎంత దారుణం చోటు చేసుకుందంతే

By:  Tupaki Desk   |   19 Jan 2020 5:03 AM GMT
30 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఎంత దారుణం చోటు చేసుకుందంతే
X
ఒక గ్రామంలో ఏదైనా దారుణం జరిగితే.. దాన్ని ప్రతి ఏటా ప్రస్తావించటమే కాదు.. దాంతో భారీ ఎత్తున రాజకీయం చేసే అలవాటు కాంగ్రెస్ కు.. కమ్యునిస్టులకు చాలా ఎక్కువ.ఇక.. ఓవైసీలాంటోళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. అలాంటి వారు ఎప్పుడూ అదే పని మీద ఉండటమే కాదు.. ప్రజల్లో భావోద్వేగాలు రగిల్చే ఏ చిన్న అవకాశాన్ని వారు వదులుకోరు. మరింతలా మాట్లాడేవారు.. ముఫ్ఫై ఏళ్ల క్రితం ఇదే రోజున జరిగిన దారుణాన్ని.. దేశ చరిత్రలో మారణహోమానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో జరిగిన ఊచకోత గురించి ఎందుకు మాట్లాడరు? మౌనంగా ఉంటారెందుకు? అన్న ప్రశ్నలకు ఏ మాత్రం సమాధానం చెప్పని పరిస్థితి.

తాము పుట్టి.. పెరిగిన నేల మీద ఉండకూడదంటూ వేలాదిమందిని వారి..వారి ఇళ్ల నుంచి.. ఆస్తుల్ని వదిలివేసి ప్రాణభయంతో పరుగులు తీసిన దారుణం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరెందుకు? అన్నది ప్రశ్న. బాధితులు కశ్మీరీ పండిట్లు కావటమేనా? అంటే అవునని చెప్పాలి. స్వాతంత్ర్యానంతరం భారత చరిత్రలో చీకటి అధ్యాయంగా చెప్పే ఈ ఉదంతంలోకి వెళితే విస్మయానికి గురి చేయటమే కాదు.. మరింత దారుణమైన ఘటనపై కాంగ్రెస్.. కమ్యునిస్టులు ఎందుకు పెదవి విప్పరన్న ప్రశ్న తలెత్తక మానదు.

1990 జనవరి ప్రారంభంలో కశ్మీరీ లోయలో రాడికల్స్ పెరిగారు.హిందువులతో కలిసి మెలిసి సోదరభావంతో మెలిగే కశ్మీరీ ముస్లింలను రెచ్చగొట్టారు తీవ్రవాద సంస్థలు. 1990 జనవరి 18 రాత్రి లోయలో ఉండే కశ్మీరీ పండిట్లకు కాళరాత్రిగా చెప్పాలి. మీరు ఇక్కడే ఉండాలంటే అయితే ఇస్లాంలో మారండి.. లేదంటే ఇక్కడి నుంచి వెళ్లిపోండంటూ కత్తులు పట్టుకొని ఘీంకరించటమేకాదు.. సాధారణ ప్రజల్ని పరుగులు పెట్టించారు.

వందలాది మిలిటెంట్లు ఏకే 47.. తుపాకులు.. కత్తులు చేతబూని వీధుల్లో స్వైర విహారం చేయటమే కాదు..అడ్డు వచ్చిన హిందువులను అడ్డంగా నరికేశారు. మహిళలపై పెద్ద ఎత్తున అత్యాచారాలు జరిగాయి. హిందువుల దుకాణాలు.. ఇతర ఆస్తిపాస్తుల్ని ధ్వంసం చేశారు. కొన్ని ఆలయాల్ని నేలమట్టం చేశారు. స్కూళ్లు.. ఆఫీసులే కాదు.. హిందువులకు సంబంధించిన ఆస్తుల్ని ధ్వంసం చేయటమే కాదు.. ఆ కాళ రాత్రి దాటి తెల్లారి స్యూరోదయం చూస్తామా? అన్న భయంతో కశ్మీరీ పండిట్లు భయం భయంతో ఉండిపోయారు. ఆ కాళరాత్రిని నేటికి గుర్తుకు తెచ్చుకున్నంతనే వణికిపోతారు. చెట్టుకు ఒకరు.. పుట్టకొకరు అన్నట్లుగా ప్రాణభయంలో పరుగులు తీసిన కశ్మీరీ పండిట్లకు జరిగిన అన్యాయం గురించి నాడే కాదు.. నేడు కూడా సెక్యులర్ పార్టీలు ఏవీ ఎందుకు మాట్లాడవన్న ప్రశ్నకు సమాధానం రాని పరిస్థితి.

ఈ దారుణ ఊచకోతకు సంబంధించిన గణాంకాల్ని చూస్తే బిత్తరపోవాల్సిందే. 1990-2010 మధ్య కాలంలో 1341 మంది పండిట్లను ఊచకోత కోశారనే ఆరోపణలు ఉన్నాయి. తక్కువలో తక్కువ ఐదు లక్షల మంది కశ్మీరీ పండిట్లు తమ సొంత ఇళ్లను.. ఆస్తుల్ని వదిలేసి ఢిల్లీ మొదలు దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినట్లుగా చెబుతారు. ఇటీవల మోడీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన వేళ.. కశ్మీరీ పండిట్లు తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలన్న వాదన పెరుగుతోంది. అయితే.. వెళ్లిన తర్వాత తమ పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం మీద చాలానే సందేహాలు నెలకొన్నట్లుగా చెబుతారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి రోజు.. రక్తం పారిన రోజుగా అభివర్ణించే రోజును సెక్యులర్ పార్టీలు గళం ఎప్పుడు విప్పుతాయో?