Begin typing your search above and press return to search.
వేర్పాటవాదుల దుర్మార్గాలు బట్టబయలు!
By: Tupaki Desk | 17 Jun 2019 5:06 AM GMTదేశం నుంచి విడిపోవాలంటూ జాతి జనుల మనసుల్లో విషాన్ని నింపే వేర్పాటువాదుల స్వార్థం ఎంతన్న విషయానికి సంబంధించిన షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణ కోసం విదేశాల నుంచి అందే ఫండింగ్ ఏమవుతుంది? ఎలా ఖర్చు చేస్తున్నారన్న విషయాలకు సంబంధించి ఊహించని కొత్త కోణం ఒకటి బయటకు వచ్చింది.
జమ్ముకశ్మీర్ కు చెందిన వేర్పాటు వాదుల్ని అదుపులోకి తీసుకొని విచారించిన జాతీయ దర్యాప్తు బృందం తాజాగా పలు విషయాల్ని వెల్లడించింది. ఈ రాష్ట్రంలోని వేర్పాటువాద నాయకులు ఇతర దేశాల నుంచి నిధులు తాము తీసుకుంటున్న విషయాన్ని ఒప్పుకున్నారని.. ఆ నిధులను ఎక్కువ భాగంగా తమ సొంత ప్రయోజనాలకే ఖర్చు చేసిన విషయం బయటకు వచ్చింది.
తమకొచ్చే నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని విదేశాల్లో చదువుకుంటున్న తమ పిల్లలకు.. బంధువుల కోసం ఖర్చు చేసినట్లుగా వారు చెప్పినట్లుగా ఎన్ ఐఏ అధికారులు వెల్లడించారు. వేర్పాటు వాదానికి ఆజ్యం పోయటానికి తాము పాక్ నుంచి నిధులు తీసుకున్న విషయాన్ని పలువురు వేర్పాటువాదులు ఒప్పుకున్నట్లుగా వెల్లడించింది. కశ్మీర్ లోయలోని యువత ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్న వేర్పాటు వాదులు.. తాము మాత్రం తమ పిల్లల్ని విదేశాల్లో చదివించటం గమనార్హం.
విదేశాల నుంచి వేర్పాటువాద నాయకులకు అందుతున్న నిధులను వారు ఎలా ఖర్చు చేస్తున్నారన్న విషయానికి వస్తే.. జహూర్ వాతాలీ అనే వ్యక్తి ద్వారా దుఖ్తారాన్ ఎ మిల్లత్ కు చెందిన మహిళా నేత అసియా అన్ ద్రబీ నిధులు అందుతున్నట్లు చెప్పారు. కశ్మీర్ వ్యాలీలో మహిళల చేత ఆందోళన చేయించటానికి తాను విదేశాల నుంచి నిధులు సేకరిస్తున్నట్లు ఆమె ఒప్పుకున్నారు. అలా వచ్చిన మొత్తాన్ని మలేసియాలో చదువుతున్న తన కొడుక్కి పంపుతున్నట్లుగా ఆమె తెలిపారు. ఇదే బాటలో మరో వేర్పాటు నేత షబ్బీర్ షా ఉన్నారు. పాక్ నుంచి నిధులు పొందే ఆయన.. హోటల్ వ్యాపారాల్ని నిర్వహిస్తున్నారు. ఇలా విదేశాల నుంచి తమకు అందే నిధులను.. తమ కుటుంబ అవసరాల కోసం వినియోగిస్తున్న వేర్పాటువాదుల అసలు రంగును కశ్మీరీ ప్రజలు గుర్తించి.. వారిని దూరం పెట్టాల్సిన అసవరం ఆసన్నమైందని చెప్పక తప్పదు.