Begin typing your search above and press return to search.

ఐఎస్ జెండా ముందు కాశ్మీరీ యువకుడు

By:  Tupaki Desk   |   4 Nov 2018 11:34 AM GMT
ఐఎస్ జెండా ముందు కాశ్మీరీ యువకుడు
X
ఎప్పుడు ఉగ్రదాడులు, జవాన్ల బుట్ట చప్పుళ్లతో అట్టుడికే జమ్మూ-కాశ్మీర్ లో యువతలో ఆవేశం పాల్లు ఎక్కువ. పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు.. పేదరికంలో మగ్గుతున్న ఎంతో మంది యువకులను చేరదీసి వారికి డబ్బు ఆశ చూపి ఉగ్రవాదులుగా మారుస్తున్నాయి. కొందరు పేదరికంతో చేరుతుండగా.. మరికొందరు చదువుకుంటున్న యువత క్రేజ్ కోసం ఉగ్రవాద గ్రూపుల్లో చేరుతున్నారు. తాజాగా కాశ్మీర్ కు చెందిన యువకుడు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ (ఐఎస్ జేకే)లో చేరాడు.

గ్రేటర్ నోయిడాలోని శారద విశ్వవిద్యాలయంలో శ్రీనగర్ కు చెందిన అహ్ తెసామ్ బిలాల్ సోఫీ (17) డిగ్రీ చదువుతున్నాడు. తాజాగా ఇతడు ఐఎస్ జెండా ముందు దిగిన ఫొటోను ఇంటర్నెట్ లో ఉంచాడు. దీంతో ఉగ్రవాద ముఠాలో చేరినట్టు తేటతెల్లమైంది.

సోఫీ నోయిదాలో చదువుకుంటూ వర్సిటీ అధికారుల నుంచి అనుమతి తీసుకొని అక్టోబర్ 28న వర్సిటీ నుంచి బయటలకు వెళ్లి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి ఆచూకీ లేకపోవడంతో సోఫీ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. తమ కుమారుడిని దయచేసి ఇంటికి పంపించాలని సోఫీ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వీడియో విడుదల చేశారు. మా కుటుంబంలో 12మంది సంతానంలో ఒకే ఒక మగ సంతానం సోఫీ అని.. మా వారుసుడిని ఉగ్రవాదులు వదిలేయాలని కోరారు. రెండేళ్లలో కుటుంబంలోని నలుగురు చనిపోగా సోఫీ మీద ఆశలు పెట్టుకున్నామని తెలిపారు.