Begin typing your search above and press return to search.
చిన్నారికి అండగా నిలిచిన ‘టైటానిక్’ హీరోయిన్..!
By: Tupaki Desk | 14 Nov 2022 11:30 PM GMTకష్టాల్లో ఉన్నవారికి దేవుడు ఏదో ఒక రూపంలో సాయం అందిస్తాడని మన పెద్దలు ఎప్పుడు చెబుతూనే ఉంటారు. ఒక చిన్నారి విషయంలో అక్షరాల ఇదే జరిగింది. ముక్కు ముఖం తెలియని ఓ చిన్నారి ఆపదలో ఉన్న సమాచారం సోషల్ మీడియా వేదికగా తెలుసుకున్న ‘టైటానిక్’ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ తనకు అండగా నిలిచారు.
12 ఏళ్ల వయస్సు కలిగిన బాలిక చిన్నతనం నుంచి శ్వాసకోశ సమస్యతో బాధపడుతోంది. తనకు కృత్రిమంగా ఆక్సిజన్ అందించకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి చికిత్స చేయిస్తున్నారు. ప్రత్యేకంగా లైఫ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్‌ను చిన్నారి గదిలో ఏర్పాటు చేయించారు. అయితే దీనికి కరెంట్ బిల్లు ఏకంగా లక్షల్లో అవుతుండటం చిన్నారి తల్లిదండ్రులకు భారంగా మారింది.
ఇకపోతే చిన్నారి తల్లిదండ్రుల సంపాదన కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో చిన్నారిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ‘గో ఫండ్ మి’ అనే స్వచ్ఛంద సంస్థ ఆన్ లైన్ ఫాట్ ఫాంలో అకౌంట్ క్రియేట్ చేసి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి అకౌంట్ లోకి హఠాత్తుగా 17 వేల పౌండ్లు వచ్చి చేరాయి. ఈ మొత్తాన్ని హాలీవుడ్ నటి కేట్ విన్స్ లెన్ దానం చేశారని తెలుసుకుని ఆశ్చర్య పోయారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. స్కాట్‌లాండ్‌లోని క్లాక్‌మన్నన్‌షైర్ కౌన్సిల్ లో కరోలైన్ హంటర్ నివసిస్తున్నారు. ఆమెకు 12 ఏళ్ళ ఫ్రేయా అనే కూతురు ఉంది. అయితే ఆమె పుట్టుకతోనే దివ్యాంగురాలు.. దీనికితోడు కొద్దిరోజులుగా శ్వాసకోశ వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈక్రమంలోనే ఫ్రేయాకు కృతిమంగా ఆక్సిజన్ అందిస్తే తప్ప ప్రాణాలను కాపాడుకోలేని స్థితికి చేరుకుంది.
దీంతో ఆమె తల్లిదండ్రులు ఫ్రేయా కోసం తన గదిలో ప్రత్యేకంగా లైఫ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్‌ను సమకూర్చారు. దీనికి నడిపించడానికి విద్యుత్ వినియోగం భారీగా అవుతుంది. దీని కోసం హంటర్ కుటుంబం ఏడాదికి 6500 పౌండ్లు (రూ.6.2లక్షలు) ఖర్చు పెడుతోంది. అయితే హంటర్ ది సాధారణ మధ్యతరగతి కుటుంబం కావడంతో తన కూతురు బ్రతికించుకోవడానికి చాలా కష్టాలు పడుతోంది.
కాగా వచ్చే ఏడాది నుంచి ఈ కరెంట్ బిల్లు మరింత అధికం అవుతుందని క్లాక్‌మన్నన్‌షైర్ కౌన్సిల్ హంటర్ కుటుంబాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తన కూతురిని కాపాడుకునేందుకు ‘గో ఫండ్ మి’ స్వచ్చంధ సంస్థతో కలిసి విరాళాలను హంటర్ కుటుంబం సేకరిస్తున్నారు.
ఈ సమయంలో సడెన్ గా తమ అకౌంట్ లోకి 17వేల ఫౌండ్ లు అంటే సుమారు 16.2లక్షలు వచ్చి చేరాయి. ఈ మొత్తాన్ని హాలీవుడ్ నటి కేట్ విన్స్ లెట్ తమకు దానంగా ఇవ్వడంపై హంటర్ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మొత్తం తమ ఖాతాల్లో ఒక్కసారి వచ్చి చేరడాన్ని తాము ఇంకా నమ్మలేక పోతున్నామని సోషల్ మీడియా ద్వారా కరోలైన్ హంటర్ వెల్లడించింది.
ఏదిఏమైనా ఆపదలో ఉన్న చిన్నారిని రక్షించేందుకు హాలీవుడ్ కేట్ విన్స్ లెట్ ముందుకు రావడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలోనూ కేట్ విన్స్ లెట్ అనేక గుప్తదానాలు చేసిందని పలువురు కొనియాడుతున్నారు. తమ అభిమాన నటి చిన్నారిని ఆదుకునేందుకు తనవంతు సాయం చేయడంపై వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.