Begin typing your search above and press return to search.
శ్రీరాముడు గురించి వివాదం లేపిన కత్తి మహేష్
By: Tupaki Desk | 7 Feb 2020 2:37 PM GMTపవన్ కళ్యాణ్ పై విమర్శలతో పాపులరైన సినీ క్రిటిక్ కత్తి మహేష్. బిగ్ బాస్ షోతో ముందు తనెవరో తెలిసేలా చేసిన మహేష్.. ఆ తర్వాత పవన్ మీద విమర్శలతోనే వార్తల్లో నిలిచాడు. ఐతే ఒక దశలో అతడి వ్యాఖ్యలు శ్రుతి మించి హైదరాబాద్ నుంచి ఆరు నెలలు బహిష్కరించే వరకు పరిస్థితి వెళ్లింది. అప్పట్నుంచి కత్తి మహేష్ పెద్దగా వార్తల్లో లేడు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల ప్రచారం చేసిన కత్తి.. తర్వాత పెద్దగా కనిపించడం లేదు. మీడియాలోనూ హైలైట్ అవ్వట్లేదు. ఐతే తాజాగా హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి గురించి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాడు కత్తి.
ఏక పత్నీవ్రుతుడిగా పేరున్న శ్రీరాముడు స్త్రీ లోలుడు అనేలా కత్తి మాట్లాడటం గమనార్హం. ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముడు చాలా ఇష్టంగా మాంసం తినేవాడంటూ వ్యాఖ్యానించాడు. శ్రీరాముడికి నెమలి తల - జింక మాంసం అంటే చాలా ఇష్టమని.. వనవాసంలో ఉండగా ఆయన జింక కోసం వెళ్లింది సీత అడిగిందని కాదని.. దాన్ని వేటాడి తిందామనే అని కత్తి అన్నాడు. అంతటితో ఆగకుండా శ్రీరాముడి అంతఃపురంలో చాలామంది మహిళలు ఉండేవారని.. వాళ్లంతా ఆయన ఉంపుడుగత్తెలని.. వారితో ఆయన సుఖించేవాడని కత్తి వెకిలిగా నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఇవన్నీ చెబితే జనాలు గుండెలు పగిలిపోతాయని కత్తి అంటుండగా.. సభికులు గట్టిగా నవ్వుతూ ఈ కామెంట్లను ఆస్వాదించడం గమనార్హం.