Begin typing your search above and press return to search.
సలాంతో బాబుపై 'కత్తి' గురి!
By: Tupaki Desk | 11 March 2018 4:42 AM GMTఅక్షరాల్ని అసరా చేసుకొని కలం కత్తితో దూసుకెళుతున్నాడు కత్తి మహేశ్. ట్వీట్లతో తెలుగునాట సంచలనంగా మారిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్ కొద్దికాలంగా చేస్తున్న ట్వీట్లు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా.. తనదైన శైలిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ట్వీట్ల షాకిచ్చారు.
తాజాగా నెలకొన్న ఏపీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కత్తి స్పందించాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సలాం చేస్తూనే.. ట్వీట్లతో షాకిచ్చే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కత్తి తాజా ట్వీట్స్ చూస్తే.. మంత్రుల చేత రాజీనామా చేయించి.. ప్రభుత్వంలో లేమన్న బుకాయింపు. ఎంపీలను మాత్రం సపోర్టుగా ఉంచి.. ఏన్డీఏలో కేవలం భాగస్వాములం అంటూ సమర్థింపు.. చంద్రబాబు.. నీకు సలాం అంటూ.. సూటిగా విషయాన్ని చెప్పేశారు.
విభజన హామీలు నెరవేర్చలేదని.. హోదాను కేంద్రం ప్రకటించలేదన్న పేరుతో తన మంత్రుల్ని కేంద్రం నుంచి ఉపసంహరించుకున్న బాబు.. ఎన్డీయే భాగస్వామ్యపక్షంగా ఉండటంపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏపీ ప్రయోజనాలకు భంగం వాటిల్లిన మాట వాస్తవమే అయినప్పుడు.. మోడీ తీరుతో విసిపోయినప్పుడు విడాకులు తీసుకుంటే మొత్తంగా తీసుకోవాలే కానీ.. విడిపోతాం కానీ.. కలిసి ఉంటామన్నట్లుగా బాబు తీరు ఉందన్న విమర్శలు పలువురి నోట వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ.. కత్తి చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇదిలా ఉంటే.. మరో ట్వీట్ లో బాబును టార్గెట్ చేసేలా కత్తి ట్వీట్ చేశారు. "తెలుగుదేశం రాజీనామాలు చేస్తే రాష్ట్రం కోసం త్యాగం. వైఎస్సార్ కాంగ్రెస్ చూస్తే.. నాటకం. జగన్ అవివ్వాస తీర్మానం పెడితే.. పెట్టే అర్హత లేదు. టీడీపీకి అదే ఆఖరి అస్త్రం. ఈ లాజిక్ అర్థమైన వాళ్ల తల వెయ్యి ముక్కలు అవుతుంది. అదే చంద్రబాబు మాయ" అంటూ ఘాటు ట్వీట్ ను పోస్టు చేశారు.