Begin typing your search above and press return to search.
'కత్తి' డిమాండ్!... సీమలో ఏపీ హైకోర్టు!
By: Tupaki Desk | 11 Jan 2018 12:26 PM GMTటాలీవుడ్ పవర్ స్టార్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో ఏకంగా పెద్ద పోరే మొదలెట్టిన సినీ క్రిటిక్ కత్తి మహేశ్ నిజంగానే రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్నటిదాకా పవన్ కల్యాణ్ సినిమాలు - ఆయన వ్యక్తిత్వం పైనే ప్రధానంగా విమర్శలు గుప్పించిన కత్తి మహేశ్... ఇప్పుడు ఏకంగా పాలిటిక్స్ గురించి గళం విప్పేశారు. అది కూడా ఏపీ రాజకీయాలపై ఆయన చేసిన తాజా వ్యాఖ్య నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ట్విట్టర్ వేదికగా కాసేపటి క్రితం కత్తి మహేశ్ పోస్ట్ చేసిన ఈ కామెంట్... తాను రాయలసీమకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆయన చెప్పకనే చెప్పినట్లైందన్న వాదన వినిపిస్తోంది.
అయినా కత్తి మహేశ్ పోస్ట్ చేసిన సదరు ట్వీట్ లో ఏముందన్న అంశానికి వస్తే... ఏపీలో ఇప్పుడు హైకోర్టు ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని, దానిని వెనుకబడ్డ ప్రాంతంగా పేరున్న రాయలసీమలో ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేసేలా ఆ ప్రాంత వాసులు పోరాటం చేయాలని కూడా కత్తి మహేశ్ పిలుపునిచ్చారు. రాయలసీమ అంటే... నాలుగు జిల్లాలని - ఆ నాలుగు జిల్లాల్లో ఏ జిల్లాలో హైకోర్టును ఏర్పాటు చేసినా ఫరవా లేదని కూడా కత్తి మహేశ్ అభిప్రాయపడ్డారు. అయినా సినీ క్రిటిక్ గా ఉన్న కత్తి మహేశ్... పవన్ కల్యాణ్ పై విమర్శలతోనే ఇప్పుడు పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగిన టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ కు తనదైన శైలిలో ఆరు ప్రశ్నలను సంధించిన కత్తి మహేశ్.. మహిళా లోకం నుంచే కాకుండా టాలీవుడ్ లో తనకు మద్దతుగా నిలిచిన కొన్ని వర్గాల చేత కూడా చీవాట్లు తిన్నంత పనిచేశారు. ఈ క్రమంలో రాజకీయాలపై... అది కూడా తాను హైదరాబాదులో ఉంటూ అక్కడికి దూరంగా ఉన్న ఏపీ రాజకీయాలపై ఆయన కామెంట్ చేయడం - ఓ ప్రాంత ప్రజలను పోరాటానికి సిద్ధం చేస్తున్నట్లుగా ప్రకటనలు గుప్పించిన కత్తి మహేశ్.. మున్ముందు మరెన్ని ఇబ్బందులు పడతారో చూడాలి. అసలు కత్తి మహేశ్ ట్వీట్లపై ఏపీ పాలిటిక్స్ ఏమంటాయో కూడా చూడాలి.