Begin typing your search above and press return to search.
కత్తి మహేష్ డ్రైవర్ సంచలన విషయాలు
By: Tupaki Desk | 15 July 2021 3:43 AM GMTప్రముఖ క్రిటిక్ కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడి చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతిపై అనుమానాలున్నాయని కత్తి మహేష్ తండ్రి ఓబులేషు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అంత్యక్రియల సందర్భంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ సైతం కత్తి మహేష్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణ జరపాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు సీరియస్ గా స్పందించారు. కత్తి మహేష్ మరణంపై విచారణ ప్రారంభించారు. కత్తి మహేష్ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
ముందుగా కత్తి మహేష్ తోపాటు ప్రయాణించిన కారు డ్రైవర్ సురేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మీకు ఎందుకు గాయాలు కాలేదని డ్రైవర్ ను అడిగారు. ఈ క్రమంలోనే డ్రైవర్ సురేష్ పలు కీలక విషయాలు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ‘తాను సీట్ బెల్ట్ ధరించానని.. కత్తి మహేష్ మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకోలేదని వెల్లడించినట్టు తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు కత్తి మహేష్ నిద్రలో ఉన్నారని.. ఆ టైంలో ఎయిర్ బ్యాగ్ కూడా తెరుచుకుందన్నారు. కత్తి మహేష్ ముందుకు పడడం వల్ల తకు తీవ్రంగా గాయాలయ్యాయన్నారు. కత్తి మహేష్ కంట్లో పగిలిన అద్దాలు గుచ్చుకొని రక్తస్రావం అయ్యిందని తెలిపారు. అంతే తప్ప ఇందులో తనను అనుమానించడానికి ఏమీ లేదని డ్రైవర్ సురేష్ తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చానని.. వెంటనే స్పందించిన హైవే పెట్రోల్ సాయంతో ఆస్పత్రికి తరలించానని సురేష్ తెలిపారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరమైతే మళ్లీ పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు.
ఇక కత్తి మహేష్ మృతి కేసును విచారిస్తున్న కోవూరు సీఐ రామకృష్ణారెడ్డి స్పందించారు. దీంతో ఆయన కత్తి మహేష్ ప్రమాదం ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కారు నడిపిన సురేష్ ను పిలిపించామని.. ప్రమాదం జరిగిన తీరు గురించి వివరాలు అడిగి ప్రాథమిక వివరాలను తెలుసుకున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరి కొంతమందిని కూడా విచారించాల్సి ఉందన్నారు.
రెండు వారాల క్రితం కత్తి మహేష్ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కత్తిని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశాడు.
అయితే కత్తి మహేష్ కు తీవ్రగాయాలు అయినప్పటికీ అతడి డ్రైవర్ కు పెద్దగా గాయాలు కాలేదు. దీంతో దళిత నాయకుడు మంద కృష్ణ, కత్తి మహేష్ తండ్రి ఓబులేష్ మరణంపై సందేహాలు లేవనెత్తారు. మహేష్ మరణం వెనుక కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మందకృష్ణతోపాటు కత్తి మహేష్ తండ్రి కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించి విచారణ జరుపుతోంది. ప్రధానంగా మహేష్ మరణం గురించి ఆస్పత్రి ముందుగా తమకు తెలియజేయకుండా నేరుగా మీడియాకు ఎందుకు విడుదల చేశారని మహేష్ తండ్రి ఓబులేష్ ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రమాదం ఎలా జరిగింది? కత్తి మహేష్ కు ఎలా తీవ్ర గాయాలయ్యాయి? అనే దానిపై విచారణ జరిపారు. తర్వాత మహేష్ చికిత్స పొందిన ఆస్పత్రిలో విచారణ జరిపేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పోస్టుమార్టం రిపోర్టు తెప్పించుకొని పోలీసులు పరిశీలిస్తున్నారు. కత్తి మహేష్ మరణం గురించి రానురాను ఈ సమస్య ఎటువంటి మలుపులు తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.