Begin typing your search above and press return to search.
ఏపీ ఎంపీలపై కత్తి మార్క్ పంచ్ లు!
By: Tupaki Desk | 2 Feb 2018 4:46 AM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులపై సింగిల్ గా వార్ చేసిన కత్తి మహేశ్ పాపులర్ అయ్యారు. తనను తాను సినీ విమర్శకుడిగా అభివర్ణించుకునే ఆయన.. సోషల్ మీడియాలో ఎంత ఉత్సాహంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. బిగ్ బాస్ షోతో సామాన్య జనాలకు సుపరిచితుడైన కత్తి మహేశ్.. పవన్ ఫ్యాన్స్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు.. విమర్శలతో మరింత పాపులర్ అయ్యారు.
సినిమా.. పాలిటిక్స్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కత్తి..తాజాగా జైట్లీ బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జైట్లీ బడ్జెట్ నేపథ్యంలో ఏపీ ఎంపీలు చేతకాని.. చేవలేని వారని తేల్చేసి సంచలనం సృష్టించారు. ఈ బడ్జెట్ అత్యంత పేలవమైనదని.. మరోసారి ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని.. ఈ విషయంలో ఏపీ ఎంపీలదే తప్పంతా అని తేల్చేశారు.
రాజధానికి.. కేంద్ర విద్యాసంస్జలకు.. గిరిజన వర్సిటీ.. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి.. ప్రాజెక్టులకు.. లోటు బడ్జెట్ కి లేదని.. మరికేముంది ఏపీ బడ్జెట్ లో అంటూ సూటిగా ప్రశ్నించారు. ఏపీ ఎంపీలంతా పనికిరాని వారిగా విరుచుకుపడ్డారు.
ఈసారి ఎవరు బీజేపీకి మద్దతు తెలిపినా..వారికి సామాన్య ప్రజల మద్దతు ఉండదని కత్తి వ్యాఖ్యానించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ.. జనసేనలు బీజేపీకి తోడుగా నిలవటం తెలిసిందే. తాజా బడ్జెట్ నేపథ్యంలో బీజేపీతో చెట్టాపట్టాలేసుకునే వారికి సామాన్య ప్రజలు షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పటం ద్వారా బీజేపీపై ఏపీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చెప్పకనే చెప్పారు.