Begin typing your search above and press return to search.
పవన్ నిజనిర్ధారణ సంఘంలో ఉన్నవారి చరిత్ర తవ్విన కత్తి
By: Tupaki Desk | 16 Feb 2018 5:42 PM GMTకత్తి మహేశ్ మరోసారి ట్విటర్ వేదికగా తన ప్రత్యర్థి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. జనసేన నేతృత్వంలో వేసిన సంయుక్త నిజనిర్ధారణ సంఘంలోని సభ్యులపై ఆయన విమర్శలు - ఆరోపణలు చేశారు. ఎవరి పేరునూ ప్రస్తావించకుండానే ఆయన పలువురు సభ్యుల గతాన్ని తవ్వారు.
రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఫోక్స్ వ్యాగన్ కార్ల కుంభకోణంలో పాత్రధారి అయిన ఓ వ్యక్తి ఇప్పుడీ నిజనిర్ధారణ సంఘంలో ఉణ్నారంటూ ఆయన ఆరోపించారు. నిజనిర్ధారణ సంఘం జేఎఫ్ ఏను కూడా ఆయన జఫ్పా కమిటీ అంటూ విమర్శించారు.
ఈ కమిటీలో ఉన్న పలువురు మాజీ అధికారులపైనా ఆయన ఆరోపనలు చేశాు. ఇందులో ఉన్న ఐఏఎస్, ఐఆరెస్ అధికారులు అంతా వివిధ కుంభకోణాల్లో ఉన్నవారేనన్నారు. కొందరైతే రిలయన్సు కంపెనీకి లాభాలు ఆర్జించి వేల కోట్ల రూపాయలు ఏపీకి నష్టం కలిగించినవారేనని ఆయన ఆరోపించారు.
అంతేకాదు.. ఈ కమిటీలో ఉన్నవారిలో ఒక వ్యక్తి హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇల్లు కొనుక్కున్న వారికి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఇల్లు ట్రాన్సఫర్ చేయకుండా తిప్పుతున్న వ్యక్తని ఆయన ఆరోపించారు. ఇలాంటివారందరితో నిజనిర్ధారణ సంఘం వేయడం సిగ్గుచేటని మహేశ్ కత్తి విమర్శించారు.