Begin typing your search above and press return to search.
పవన్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన కత్తి మహేశ్
By: Tupaki Desk | 14 March 2018 4:51 PM GMTజనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు సినీ విమర్శకుడు కత్తిమహేశ్. ప్రత్యేక హోదా కోసం తాను అవసరమైతే దీక్షకు దిగతానని ప్రకటించిన నేపథ్యంలో కత్తి మహేశ్ స్పందించారు. `ప్రత్యేకహోదా కోసం పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తే - నేను కూడా జాయిన్ అవుతా` అని ప్రకటించారు. ఈ మేరకు ఓ ట్వీట్ లో తన ఆఫర్ ఇచ్చారు. ప్రత్యేకహోదా! ఆంధ్రుల హక్కు అని కత్తి మహేశ్ తెలిపారు.
పలు ట్వీట్లలో కత్తిమహేశ్ తన అభిప్రాయం పంచుకున్నారు. `ప్రశ్నిస్తున్నాడు. చివరికి... ఎంతో కొంత... ప్రశ్నలు సంధిస్తున్నాడు.` చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సిన క్షమాపణలు - పవన్ కళ్యాణ్ చెబుతున్నట్టు లేదూ!!! అంటూ సెటైర్లు వేశారు. అనంతరం `పవన్ కళ్యాణ్ స్పీచ్ ను స్వాగతిస్తున్నాను. చాలా విలువైన నిర్ణయాలు జనసేన అధినేత తీసుకున్నారు. నిజంగా అభినందనలు. దళితులకు ఉపాధి కల్పన. వ్యాపార అవకాశాలు అన్నప్పుడు రాని శబ్దం, కేకలు కాపు రిజర్వేషన్లు అనే సరికీ ఎందుకు వచ్చిందో - ఒకసారి పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. ఇప్పటికి ఒక్క దళిత రెప్రజెంటేటివ్ జనసేనలో లేకపోవడాన్ని కూడా గమనించాలి. జనసేన కాపు పార్టీ అని ఎందుకు ముద్రపడిందో తెలుస్తుంది. ఈ సమస్యలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే...బాగుండేది. ఇన్నాళ్లు లెక్కగట్టి ఈరోజు అప్పజప్పడం వల్ల ఏమి లాభం. ఓహ్...ఎన్నికలు కదా మన లక్ష్యం! మంచిదే. కనీసం ఒక లక్ష్యం ఏర్పడింది` అంటూ వ్యాఖ్యానించారు.
`అసెంబ్లీకి 30 కోట్లు. పార్లమెంటు సీటుకి 100 కోట్లు చంద్రబాబు నాయుడు రెడీగా పెట్టుకున్నాడు. ఓట్లు కొనడమే లక్ష్యం. మనం అమ్ముడుపోవడానికి రెడీనా కాదా అనేదే ఛాయిస్` అంటూ ఈ సందర్భంగా చంద్రబాబును సైతం కెలికారు కత్తిమహేశ్.