Begin typing your search above and press return to search.

కత్తి ప్రశ్న: గవర్నర్ పవన్ నే ఎందుకు పిలిచాడు?

By:  Tupaki Desk   |   27 April 2018 6:03 AM GMT
కత్తి ప్రశ్న: గవర్నర్ పవన్ నే ఎందుకు పిలిచాడు?
X
పవన్ కళ్యాణ్ మీద.. అతడి అభిమానుల మీద మహేష్ కత్తి దాడి కొనసాగుతోంది. తన సోషల్ మీడియా అకౌంట్లకు బ్రేక్ పడటంతో పవన్ ఫ్యాన్స్ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న కత్తి.. తాజాగా పవన్ మీద దాడిని మరింత తీవ్రతరం చేశాడు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో పవన్ చేతులు కలిపాడని ఆరోపిస్తున్న కత్తి.. తెలుగు రాష్ట్రాల గవర్నర్ తో పవన్ సంబంధాలపై ప్రశ్నలు సంధించాడు. తెలుగు రాష్ట్రాల్లో 53 దాకా రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయని.. ఐతే ఇటీవల ఏ పార్టీని కాదని.. జనసేన అధినేత అయిన పవన్ ను మాత్రమే గవర్నర్ ప్రత్యేకంగా విందుకు పిలిచాడో సమాధానం రావాలని కత్తి అన్నాడు. పవన్ కు గవర్నర్ సాయపడుతున్నాడని తాను ఇంతకుముందు ఆరోపిస్తే తనపై దాడి చేశారని.. కానీ ఈ పరిణామంతో ఆ ఆరోపణలు నిజమని తేలిందని కత్తి అన్నాడు.

ఇక పవన్ అభిమానులు తనను ఇంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంటునని ఆరోపించారని.. కానీ ఇప్పడు టీడీపీ తొత్తు అంటున్నారని.. అసలు తాను ఏ పార్టీకి చెందిన వాడినో ముందు వాళ్లు డిసైడ్ కావాలని కత్తి అన్నాడు. తాను రాజ్యాంగ హక్కుల కోసం పోరాడే వ్యక్తినని.. పవన్ కళ్యాణ్.. అతడి అభిమానులు దానికి పూర్తి విరుద్ధమని.. అందుకే తన పోరాటమని కత్తి చెప్పాడు. మరోవైపు భారతీయ జనతా పార్టీ గురించి కత్తి మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల్లో అక్రమాలకు ఆ పార్టీ చేయాల్సిందల్లా చేస్తోందని.. డబ్బులు కుమ్మరిస్తోందని ఆరోపించాడు. తాను అంటున్న మాటలు అందరూ గుర్తు పెట్టుకోండని.. కర్ణాటకలో ఆ పార్టీ ఓడిపోతుందని అన్నాడు. అంతే కాక తర్వాత రాజస్థాన్.. ఆపై మధ్య ప్రదేశ్.. చివరగా ఉత్తర్ ప్రదేశ్ లో భాజపా ఓడిపోతుందని.. భవిష్యత్తులో ఎన్నటికీ వాళ్లు అధికారం చేపట్టరని జోస్యం చెప్పాడు కత్తి.