Begin typing your search above and press return to search.
బండోడు.. బాత్రూంలు కడిగేటోడు ఇష్యూ ఏంది?
By: Tupaki Desk | 9 Dec 2017 4:47 AM GMTసోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ప్రతి యాంగిల్ లోనూ తప్పులు చూపిస్తూ.. పోస్టుల మీద పోస్టులు పెట్టే బిగ్ బాస్ ఫేం కత్తి మహేశ్ పుణ్యమా అని.. సోషల్ మీడియాలో చర్చ అంతకంతకూ పెరుగుతోంది. పవన్ పేరు ఎత్తితేనే అంతెత్తు విరుచుకుపడే మహేశ్ కత్తి మరింత మంట పుట్టేలా వ్యాఖ్యలు చేశారు. తనను బండోడు.. బాత్రూంలు కడిగేవాడంటూ జీవీ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యాడు.
ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. జీవీ తనపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పవన్ ను అభిమానించే సినీనటుడు జీవీ విదేశాల్లో జరిగిన కాపు కులసభలో మాట్లాడుతూ తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని కత్తి మహేశ్ పేర్కొన్నారు.
చిన్న చిన్న విలన్ పాత్రలు చేసే జీవీ.. కువైట్ లోనో ఎక్కడో జరిగిన కాపుల సభలో అనరాని మాటలు అనేశాడన్నారు. పవన్ కల్యాణ్ ఫోటో ఒకటి పెట్టుకొని.. తనపై అనరాని మాటలు అన్నాడన్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో తాను బాత్రూంలు కడిగానని.. తనతో పాటు మిగిలిన వారూ కడిగారని.. దాన్ని పట్టుకొని బాత్రూంలు కడిగేవాడు.. బండోడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.
పవన్ కల్యాణ్ ను వీళ్లంతా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే కాపులు కాబట్టి అని చెబుతూ వాడు.. వీడు అన్న మాటలతో పాటు హైదరాబాద్ వెళ్లిన తర్వాత వాడి సంగతి చూస్తానంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు. అయితే.. జీవీ మాదిరి తాను కుసంస్కారిని కాదని.. తాను వాడు.. వీడు అననని చెప్పారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని.. ఏం చేస్తాడో అది చేయొచ్చన్నాడు.
ఇంత దురహంకారంతో మాట్లాడే జీవీ లాంటోళ్లు పవన్ అభిమానులమని చెబుతుంటారని.. వాస్తవానికి బాత్రూంలు కడిగేవాడు.. పాకీ పని చేసేవాడంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన జీవి మీద ఎస్సీ..ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయొచ్చన్నారు. మన ఆరోగ్యం కోసం పని చేసే శానిటరీ వర్కర్ ను పాకీ పని అంటూ చులకనగా మాట్లాడటం జీవీ స్థాయిని తెలియజేస్తుందని.. చీప్ మెంటాలటీని సూచిస్తోందన్నారు.
బాత్రూంలు కడుక్కోవటం తప్పేం కాదు.. నా రూంలో నేనే కడుక్కుంటా.. అంతలోనే నాయుళ్లం చూపిస్తామని అంటున్నాడని.. ఇక్కడా కాపు యారోగెన్సీ ప్రదర్శించారన్నారు. పవన్ కల్యాణ్ ఫోటో వెనుక పెట్టుకొని.. కాపుల సభలో దాంట్లో మేం కాపులం.. మేం ఇలా చేస్తామంటే కుల వివక్ష.. కుల దురహంకారం చూపిస్తున్నట్లుందన్నారు. తాను కానీ శానిటరీ వర్కర్ ను అయితే పరువునష్టం దావా వేసేవాడినన్నారు. "నువ్వు కాపు అయితే.. అప్పర్ కాస్ట్ అయితే అంత దురహంకారమా? మరి కాపులైతే రిజర్వేషన్ల కోసం దేబిరుస్తారుగా..? దళితులంటే అంత చులకనా?" అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
జీవీ పవన్ అభిమాని అని.. పవన్ కు సపోర్ట్ చేస్తాడని..మరి ఇలాంటి వాళ్లందరిని పెట్టుకొని నాకు కులం లేదబ్బా అంటే నమ్మాలా?.. మేం వెధవలమా? అని ప్రశ్నించారు. జీవీలాంటోళ్లు చేసిన వ్యాఖ్యల్ని పవన్‌ను ఖండిచమనండి చూద్దామన్నారు. జీవీతో నాకు సంబంధం లేదు.. కాపు కులంతో నాకు సంబంధం లేదని ఒక్కమాట చెప్పమనండి చూద్దామంటూ పవన్ కు సవాలు విసిరారు.