Begin typing your search above and press return to search.
చంద్రబాబు... కేంద్రబాబు అయ్యారే!
By: Tupaki Desk | 14 Feb 2018 11:35 AM GMTపవన్ కల్యాణ్ పై నెలల తరబడి వివాదం నడిపేసిన టాలీవుడ్ సినీ క్రిటిక్ కత్తి మహేశ్... ఇక ఎంతమాత్రం సైలెంట్‌గా ఉండేందుకు ఇష్టపడటం లేనట్లుగా తెలుస్తోంది. మొన్నటిదాకా సినీ ఇష్యూలకు సంబంధించి విషయాలపైనే మాట్లాడిన కత్తి మహేశ్... ఇటీవలే రాజకీయాలపైనా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. మొన్నటిదాకా కేవలం పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపైనే సెటైరిక్ విమర్శలు చేసిన కత్తి మహేశ్... తాజాగా ఏపీలో అధికార పార్టీ టీడీపీ, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబుపైనా తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఏకంగా కేంద్రబాబు అంటూ వ్యాఖ్యానించిన కత్తి మహేశ్... చంద్రబాబు ఎప్పుడో కేంద్రం వద్ద సాగిలపడిన నేతగానే అభివర్ణించినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. మొన్నటి కేంద్ర బడ్జెట్ లో ఏపీని జరిగిన తీవ్ర అన్యాయంపై ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు సాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో విపక్ష వైసీపీ తొలి నుంచి తాను వినిపిస్తున్న ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరోమారు ప్రస్తావించి... తన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించేసింది. ఏప్రిల్ 5 లోగా ఏపీకి ప్రత్యేక హోదా రాని పక్షంలో తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న సంచలన ప్రకటన చేశారు.
ఈ ప్రకటనతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి. కాసేపటి క్రితం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు రాజీనామాల విషయంపైనే సుదీర్ఘంగా చర్చించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రులుగా ఉన్న తమ పార్టీ నేతలు ఇద్దరూ రాజీనామాలు చేయడం ద్వారా పెద్దగా ప్రయోజనమేమీ లేదన్న రీతిలో లీకులు ఇచ్చేసిన చంద్రబాబు... మొత్తంగా ఎన్డీఏ నుంచి వైదొలగే విషయంపై ఇంకా ఓ స్పష్టతకు రాలేకపోయారనే చెప్పాలి. ఈ క్రమంలో కాసేపటి క్రితం ట్విట్టర్‌లో ప్రత్యక్షమైన కత్తి మహేశ్.. చంద్రబాబు విశ్వసనీయతను ప్రశ్నించే విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఏకంగా కేంద్రబాబు అంటూ తనదైన సెటైర్ సంధించిన కత్తి మహేశ్... జగన్ తన స్పష్టమైన ప్రణాళికను ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం కోసం ఏపీ ప్రజలు వేచి చూస్తున్నారని కామెంట్ చేశారు. కత్తి మహేశ్ ట్వీట్ ఎలా సాగిందన్న విషయానికి వస్తే... *జగన్ తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ప్రకటించారు. ఉద్యమ రూపురేఖలు కార్యాచారణ నిర్ణయించారు. ప్రత్యేక హోదానే లక్ష్యం అని తేల్చేశారు. ఇక, కేంద్రబాబు... సారీ చంద్రబాబు నిర్ణయం కోసం ఆంధ్రప్రజలు వెయిటింగ్ !' అని కత్తి మహేష్ ట్వీట్ చేశారు.
ఇక పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీతో ఒరిగేదేమీ లేదని కూడా కత్తి మహేశ్ ఆరోపించారు. జేఎఫ్‌సీపై లోకసత్తా జయప్రకాష్ నారాయణ్ చేసిన పలు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మహేష్ కత్తి గట్టి కౌంటర్ ఇచ్చారు. *జేఎఫ్‌సీ వల్ల అద్భుతాలు ఏమీ జరగవు, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అరిచి గోలపెట్టకుండా సమస్యని ఎలా తీర్చవచ్చొ ఆలోచిస్తాం* అన్న వ్యాఖ్యలను మహేష్ కత్తి పరోక్షంగా తప్పు పట్టారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. *ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ప్రజాఉద్యమం జరగకుండా చూసుకుంటారు. భేష్ !* అంటూ కౌంటర్ ఇచ్చారు. *కొత్తగా ఏర్పడిన జేఎఫ్ సీ మాకు చిత్తశుద్ధి తప్ప బలం లేదని చెబుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. కావాల్సింది బలమున్నోళ్లే. ఉద్యమ తెగువున్నోళ్లు. పోరాట పటిమ ఉన్నోళ్లు. చిత్తశుద్ధి ఒక్కటి ఉంటే సరిపోని టైం ఇది. ఇక టైపాస్ - టైంవేస్ట్ ఆపండి* అంటూ మహేష్ కత్తి సూచించారు. ఇక వాలెంటైన్స్ డేను పురస్కరించుకుని కూడా రాష్ట్ర రాజకీయాలపై కత్తి మహేశ్ ఆసక్తికర పోలికలు చెప్పారు. *చంద్రబాబుకు మోడీ వాలెంటైన్.. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు వాలెంటైన్.. జేపీ కూడా పవన్ కల్యాణ్ వాలెంటైన్' అని మహేష్ కత్తి సెటైర్ వేశారు.