Begin typing your search above and press return to search.
పవన్ పై ట్వీట్స్ కత్తి దూసిన మహేశ్
By: Tupaki Desk | 8 Dec 2017 8:13 AM GMTపవన్ కల్యాణ్ నోటి నుంచి ప్రతి మాటకు కౌంటర్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది కత్తి మహేశ్ యవ్వారం చూస్తుంటే. పవన్ మాట్లాడనప్పుడు కూడా ఆయనపై విమర్శలు చేసే కత్తి.. ఇక మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారు? పవన్ పుణ్యమా అని కొత్త తరహా క్రేజ్‌ను సొంతం చేసుకున్న మహేశ్ కత్తి.. ఇప్పుడు తన దూకుడ్ని మరింత పెంచారు. గడిచిన మూడు రోజులుగా ఏపీలో పర్యటిస్తున్న పవన్ తీరును.. ఆయన చేసిన వ్యాఖ్యల్ని కత్తి లాంటి ట్వీట్స్ తో చీల్చి చెండాడారు.
విశ్వమానవుడి హోదాను పవన్ కు తగిలించి వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్న మహేశ్.. కులం మొదలు ప్రధాని నరేంద్ర మోడీతో స్నేహం వరకూ అన్ని అంశాలపై తనదైన శైలిలో ట్వీట్స్ తో ఏకిపారేశారు. ఆయనేం ట్వీట్స్ చేశారన్నది ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా రాసేస్తే..
"ఒక కులానికే నిన్ను ఎవరు పరిమితం చెయ్యడం లేదు PK. కాకపోతే, కాపు సామాజిక వర్గం మీ అన్నయ్య చేసిన అన్యాయానికి నీ నుంచీ ప్రతిఫలం ఆశిస్తోంది. నేను విశ్వమానవుడ్ని. నాకు కులం లేదు...లాంటి ఉబుసుపోని కబుర్లు చెప్పకు. కాపు రిజర్వేషన్ల పట్ల నీ వైఖరి నీ సహజ ప్రవృత్తిని తెలియజెప్పేసింది"
"చిరంజీవి సామాజిక న్యాయం అంటే నమ్మాము. మోసం చేసి పోయాడు. రాజకీయంగా కాపులను - బహుజనులు - దళితులను - మైనారిటీలను ఒక పాతిక సంవత్సరాలు వెనక్కి తీసుకుని పోయాడు. ఇప్పుడు నువ్వొచ్చావ్. నాకు కులం లేదు అంటున్నావ్. ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో ఉన్నదే కులం. అధికారం వద్దు అంటున్నావ్. రాజకీయం చేసేదే గెలుపుకోసం.అధికారం కోసం. అవి అవసరం లేకుండా సేవ చెయ్యాలంటే ఎన్జీవో పెట్టుకో...రాజకీయాలు ఎందుకు? కాస్త తెలుసుకుని మాట్లాడు. గ్రవుండ్ రియాలిటీ గ్రహించి మాట్లాడు"
"తుని ఘటన జరిగినప్పుడు కేరళ నుంచి హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన ఈ విశ్వ మానవుడు - మరే ఇతర కుల సమస్య గురించి ఒక్కసారైనా ఎందుకు స్పందించలేదు?"
"మోడీ లాంటి నరహంతకుడితో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన నిన్ను - మతోన్మాద శక్తులతో చెయ్యి కలపకు అన్న శేఖర్ కమ్ముల చెడ్డోడు అయ్యాడా! ప్రధానమంత్రి అయినంత మాత్రమేనా మోడీ గుజరాత్ లో చేసింది రైట్ అయిపోతోందా? నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూనే ఉంది పవన్ కళ్యాణ్".