Begin typing your search above and press return to search.
పవన్ మీద విమర్శల కత్తి దూశాడు
By: Tupaki Desk | 21 April 2018 5:36 AM GMTపవన్ పేరు ఎత్తితే చాలు విమర్శలతో విరుచుకుపడతారు కత్తి మహేశ్. అందరూ అందరికి నచ్చాలని లేదు. కానీ.. తనకు నచ్చని పవన్ ను ఉద్దేశించి అదే పనిగా విమర్శలు చేయటం.. సోషల్ మీడియాలో పవన్ పై కామెంట్లు పెట్టటం.. దానికి స్పందనగా పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయితే.. వాళ్లను పవన్ ఎందుకు కంట్రోల్ చేయరన్న వాదనతో తెర మీదకు వచ్చిన పవన్.. గడిచిన కొద్ది నెలలుగా పవన్ పై ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారో తెలిసిందే.
విషయం ఏదైనా.. పవన్ పేరు ఎత్తిన వెంటనే తనదైన లాజిక్కులతో మాట్లాడే కత్తి మహేశ్..తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై మరోసారి స్పందించారు. ఒక మీడియా ఛానల్లో నిర్వహించిన చర్చ సందర్భంగా గురువారం రాత్రి ట్విట్టర్లో ట్వీట్లు మొదలుకొని శుక్రవారం వరకూ చోటు చేసుకున్న పరిణామాలు..కొన్ని మీడియా ఛానల్స్ ను చూడొద్దంటూ పవన్ ఇచ్చిన పిలుపు వరకూ స్పందించారు. కత్తి ఏమన్నారో.. ఆయన మాటల్లో.. ఎలాంటి వ్యాఖ్యానం లేకుండా చూస్తే..
పవన్‌కల్యాణ్ ది మూర్ఖత్వమో.. అమాయకత్వమో.. అవగాహన రాహిత్యమో నాకు ఇప్పటికి అర్థం కాదు. మొన్న ఇద్దరూ సారీ చెప్పేశారు. మొన్న ఆ అమ్మాయి నోరు జారి తప్పుగా మాట్లాడింది. వెంటనే సారీ చెప్పింది. రాంగోపాల్ వర్మ కూడా సారీ చెప్పేశారు. ఇప్పటివరకూ వర్మ సారీ చెప్పింది లేదు. ఈసారి ఆయన కూడా వెంటనే సారీ చెప్పేశారు.
అసలు ఇష్యూ ఇది కాదు. బూతుమాట కాదు ఇష్యూ. అసలు సమస్య సినిమా ఇండస్ట్రీలోని లైంగిక వేధింపుల సమస్య. ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన వచ్చి ఉంటే ఆయన్ను హీరోగా భావించేవాడ్ని. నెత్తిన పెట్టుకునేవాడ్ని. ఇంతకంటే హీరో సినిమా ఇండస్ట్రీలో లేడు అనేవాడిని.
అసలు మీడియా ముందుకు ఎందుకు వస్తారు? మీడియా ఫోర్త్ ఎస్టేట్. చట్టం.. న్యాయం జరగనప్పుడు మీడియా దగ్గరకు వస్తారు. ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా? మీడియా మీద ఆరోపణలేంది? ఒక బూతు మాట మాట్లాడించటానికి మీడియా అంతా కుట్ర పన్ని అదేదో పార్టీ అఫిలియేషన్ తో చేసినట్లుగా మాటలేందండి? ఒక చిన్న బూతుమాటతోనే పోయేదండి ఆయన ఇమేజ్. పవన్ స్టార్ పవన్ కల్యాణ్.. లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఒక బూతుమాట మాట్లాడితే ఏమైపోయిందండి? ఓకే.. మనస్తాపం చెందారు. మనం అందరం అంగీకరించాల్సిన అంశం.
పవన్ ఫ్యాన్స్ ఎవరినైనా తిట్టే ముందు వాడే మొదటి తిట్టు అది. ఆ తర్వాత స్థాయిలు వేరే ఉంటాయి. ఎవరి అమ్మ అయినా అమ్మే కదా. మా అమ్మను అన్నప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లారు మరి? అప్పుడు ట్వీట్ చేసి ఫ్యాన్స్ కు ఒక మాట చెప్పవయ్యా అంటే.. అప్పుడు రాలేదు. తన దాకా వస్తే.. తన తల్లిదాకా వస్తే తనకు మాత్రమే తల్లి.. మిగితా తల్లులు ఎవరూ తల్లులు కాదు.
ఆర్జీవీని బండ బూతులు తిడుతున్నారు. శ్రీరెడ్డిని అయితే అది.. ఇది అన్న తేడా లేకుండా అన్ని బూతులు తిట్టేస్తున్నారు. వాళ్లందరికి ఒక్కసారైనా ఒక మాట చెప్పారా? బూతు మాటలు మాట్లాడొద్దండని ఎప్పుడైనా చెప్పారా? ఆర్నెల్లుగా ఇంత జరుగుతుంటే ఒక్కసారైనా చెప్పారా? ఇంత బాధ్యతారాహిత్యంతో మాట్లాడతారా. ఒక చిన్న మాటను పట్టుకొని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నది ఎవరు?
తిట్టేందుకు ఒకరి తర్వాత ఒకరు వస్తారా? నాగబాబు అంటే ఒకే తల్లి కడుపున పుట్టినోడు సరే. వచ్చి తాట తీస్తానడంటారా?. రాంగోపాల్ వర్మను పట్టుకొని అన్నేసి మాటలు అంటారా? వర్మకు నొప్పి ఉండదా? మర్యాదగా సారీ చెప్పిన తర్వాత కూడా టార్గెట్ ఎందుకు? ఇప్పుడు పవన్ వచ్చింది ఎందుకు? సమస్యను పరిష్కరించటానికా.. పెంచి పోషించటానికా?
మీడియా మీద దాడి చేయిస్తారా? నిన్న ఏమో టీవీ 9 మీద దాడి. ఈ రోజేమో ఏబీఎన్ వెహికిల్స్ మీద దాడి చేయిస్తారా? ట‌్విట్టర్ లో ఫోటోలు పెట్టటం ఏమిటి? శ్రీని ఫోటోను పెట్టి.. మళ్లీ ఇంకో ఫోటో పెట్టి ఇప్పుడు ఇలా కనిపిస్తున్నారంటూ పెడుతున్నారు. ఎందుకు? అంటే.. ఐడెంటిఫికేషన్ పెరేడ్ పెడుతున్నారా? మీ ఫ్యాన్స్ కొట్టటానికి.. తిట్టటానికి. రాజ్యాంగం మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ హక్కుల మీద కానీ ఏమాత్రం అవగాహన లేని ఈ మనిషి రాజకీయాల్లోకి వచ్చి పీకేదేమిటో నాకైతే అర్థం కావట్లేదు. పీకే అని వాడుతున్నాను. ఇది చాలా చిన్న బూతు. మీ పేరు కూడా పీకేనే. చాలా జాగ్రత్తగా చూసుకోండి. అనవసరమైన విషయాల మీద అవగాహనారాహిత్యం మీద మాట్లాడుతూ వెళితే.. మీడియా ఎగైనస్ట్ గా వెళతారా.
ఆయన పార్టీ లాంఛ్ అప్పుడు మీడియా కావాలి. మొన్న సభ పెట్టినప్పుడు మీడియా కావాలి. ఆరు కిలోమీటర్లు పాదయాత్ర.. పెద్ద పాదయాత్ర చేసినప్పుడు మీడియా కావాలి. ప్రతి దానికి మీడియా కావాలి.. ఎదుగుతున్న రాజకీయ నాయకుడు.. ఇంత అమెచ్యూర్ పొలిటీషియన్ ను నేనైతే ఎక్కడా చూడలేదు. గల్లీ లెవెల్లోనూ ఇంత అమెచ్యూర్ గా వ్యవహరించరు. పలానా చానల్ చూడొద్దంటారా? ఏ ఆధారంతో ఆ మాటలు అంటున్నాడు? ఇవన్నీ అడిగితే ఈయన ఎక్కడ ముఖం పెట్టుకుంటాడు?