Begin typing your search above and press return to search.

క‌త్తి ట్వీట్ తో ప‌వ‌న్ కు మ‌ళ్లీ పంచ్‌!

By:  Tupaki Desk   |   16 Feb 2018 6:58 AM GMT
క‌త్తి ట్వీట్ తో ప‌వ‌న్ కు మ‌ళ్లీ పంచ్‌!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సంబంధించి ప్ర‌తి విష‌యాన్ని నిశితంగా ప‌రిశీలిస్తూ.. టైమ్లీగా రియాక్ట్ అయ్యే వారిలో సినీ విమ‌ర్శ‌కుడిగా పేరున్న క‌త్తి మ‌హేశ్ ముందుంటారు. వ్యంగ్య వ్యాఖ్య‌లు చేయ‌టంతో పాటు.. ప‌వ‌న్ అభిమానులు మొద‌లు ప‌వ‌ర్ స్టార్ వ‌ర‌కూ చురుకుపుట్టించేలా అక్ష‌రాల్ని సంధించ‌టంతో క‌త్తి అంత‌కంత‌కూ ప‌దును తేలుతున్నారు. ఇందుకు ఆయ‌న చేసిన ట్వీట్ ను నిద‌ర్శ‌నంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఉండ‌వ‌ల్లిలో త‌న పార్టీ నేత‌ల‌తో క‌లిసి భేటీ అయిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై మాట్లాడే స‌మ‌యంలో ప‌వ‌న్ ఏర్పాటు చేసిన జేఏసీ త‌మ‌కు వ్య‌తిరేకంగా లేద‌ని చెప్ప‌టం తెలిసిందే. ఈ స‌మావేశంలో ప‌వ‌న్ మ‌నోడే అన్న అర్థం వ‌చ్చేలా చంద్ర‌బాబు మాట్లాడ‌టం.. ఆ విష‌యం మీడియాలో వ‌చ్చింది.

మీడియాలో వ‌చ్చిన మాట‌కు త‌న‌దైన రీతిలో పోస్ట్ చేశారు క‌త్తి. "ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌నోడే.. తెలుగుదేశం పార్టీ స‌మావేశంలో చంద్ర‌బాబు" "తూచ్!!! ఇదేగా నేను ఫ‌స్ట్ నుంచీ చెబుతోంది" అంటూ ట్వీట్ చేశారు. ప‌వ‌న్ ఏర్పాటు చేసిన జేఏసీ వ‌ల్ల ఎలాంటి ఇబ్బంది లేద‌న్న మాట‌ను మంత్రుల‌తో చెప్పిన బాబు మాట‌లకు వ్యంగ్య‌స్త్రాన్ని సంధించారు. ప‌వ‌న్ ఇచ్చిన గ‌డువు దాటింద‌ని.. అత‌డి మాట‌ల్ని ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేద‌న్న క‌త్తి.. మీరు ఏమీ చేయ‌లేర‌ని అంటున్నారు.. మ‌రి త‌దుప‌రి కార్య‌క్ర‌మం ఏమిటో అంటూ క‌త్తి క్వ‌శ్చ‌న్ చేశారు.

అవ‌కాశం ఉన్న ప్ర‌తి ఒక్క‌రిపైనా ట్వీట్ అస్త్రాన్ని సంధిస్తున్న క‌త్తి.. తాజాగా ఆంధ్రా మేధావుల సంఘం అధ్య‌క్షుడైన చ‌ల‌సాని శ్రీ‌నివాస్ రావుపైనా వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం పోరాడ‌దామ‌ని పిలుపునిచ్చి మౌనంగా ఉండ‌టాన్ని ప్ర‌శ్నించిన కత్తి.. ఉద్య‌మ‌కారులు లెక్క‌లు తియ్య‌డంలో కాల‌యాప‌న చేయ‌రు.. లెక్క‌లు తేల్చే ప‌నిలో ఉంటారంటూ వ్యాఖ్యానించారు.

చ‌దివినంత‌నే చురుక్కుమ‌నేలా ఉన్న క‌త్తి మాట‌లు బాగానే ఉన్నా.. లోతుగా విశ్లేషిస్తే మాత్రం ఆయ‌న మాటల్లో అప‌రిప‌క్వ‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మాన్ని నిర్మించే క్ర‌మంలో కేసీఆర్ నెల‌ల త‌ర‌బ‌డి బ‌య‌ట‌కు వ‌చ్చే వారు కాద‌ని చెప్పాలి. ఆ టైంలో ఆయ‌న ఏదేదో చేస్తార‌ని ఇష్టారాజ్యంగా మాట్లాడే వారు. కానీ.. కేసీఆర్ మాత్రం త‌న వాద‌న‌కు బ‌లం చేకూరే అంశాల్ని.. వ్య‌క్తుల్ని క‌ల‌వ‌టం.. వారితో మేథోమ‌ధ‌నం జ‌ర‌ప‌టం ద్వారా మ‌రిన్ని కొత్త విష‌యాల్ని తెర మీద‌కు తెచ్చే వారు. తెలంగాణ ఉద్య‌మం అలా మొద‌లై.. ఇలా పూర్తి కాలేద‌న్న‌ది క‌త్తి లాంటోళ్లు గుర్తిస్తే మంచిది. తెలంగాణ ఉద్య‌మం స‌క్సెస్ లో స‌మైక్య వాద‌న ఫెయిల్యూర్ ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

ఇప్పుడు హోదా గురించి పోరాడే స‌మ‌యంలో ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని.. ఏపీకి చేస్తున్న మోసాన్ని ఎండ‌గ‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన శ‌క్తియుక్తుల్ని స‌మ‌కూర్చుకోవ‌టం అవ‌స‌రం. అంతేకానీ.. రోజుకో స‌టైర్ ట్వీట్ పెట్ట‌టం.. పంచ్ డైలాగుల‌తో అంద‌రిని ప్ర‌శ్నించే ముందు.. హోదాపై ఏపీ ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చేలా.. ఏపీకి జ‌రిగిన అన్యాయం అర్థ‌మ‌య్యేలా క‌త్తి లాంటోళ్లు కామెంట్లు చేస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. బొక్క‌లు వెత‌క‌టం త‌ప్పు కాదు. కానీ.. ఆ క్ర‌మంలో అంద‌రిని క‌లుపుకుపోవాల‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.