Begin typing your search above and press return to search.
పాస్ పోర్ట్ కావాలంటే టాయ్ లెట్ ఉండాల్సిందే
By: Tupaki Desk | 18 Oct 2016 10:09 AM GMTమరుగుదొడ్ల వాడకంపై దేశవ్యాప్తంగా వస్తున్న చైతన్యానికి ఇదొక ఉదాహరణ. పలు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు పొందేందుకు మరుగుదొడ్లను తప్పనిసరి అని తేల్చిచెప్తుండగా..తాజాగా పాస్ పోర్ట్ పొందేందుకు టాయిలెట్ ను కంపల్సరీ చేస్తూ మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లేందుకు పాస్ పోర్ట్ పొందే అభ్యర్థులు ఇకనుంచి తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) కలిగి ఉండాలి. మా ఇంట్లో టాయ్ లెట్ ఉంది అని సంబంధింత పంచాయితీ ఆఫీసు ఇష్యూ చేసే ఎన్ ఓసీ సర్టిఫికెట్ ను జతచేయాల్సి ఉంటుంది. అప్పుడు కానీ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తును పరిశీలించరన్న మాట.
మధ్యప్రదేశ్ నుంచి విదేశాలకు భారీ సంఖ్యలో వ్యాపార - ఉద్యోగ - టూరిజం కోసం యువత వెళుతుంటారు. స్వఛ్ భారత్ మిషన్ లో భాగంగా పాస్ పోర్ట్ అధికారులు ఈ నిబంధనల్లో మార్పులు చేసినట్టు కత్నీ జిల్లా రూరల్ ఎస్పీ తెలియజేశారు. ఎన్ ఓసీ సర్టిఫికేట్ తోనే సరిపెట్టబోమని పోలీస్ వెరిఫికేషన్ లో మరుగుదొడ్డి ఉందా లేదా అని పరిశీలించనున్నట్టు ఆయన తెలిపారు. స్వఛ్ భారత్ మిషన్ టార్గెట్ రీచ్ కావడానికి స్థానిక ఏరియా అధికారులు ఓపెన్ డెఫకేషన్ (ఓడీఎఫ్) రూల్స్ ను మార్చుకోవచ్చని ఆ రాష్ట్ర స్వఛ్ భారత్ మిషన్ చీఫ్ ఆఫీసర్ వివరించారు. 2017-18 నాటికి రాష్ట్రంలో 55 లక్షల టాయిలెట్ లు నిర్మించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలిపారు. పాఠశాలలో “టాయిలెట్ హై” (మా ఇంట్లో టాయిలెట్ ఉంది) అనే అవేర్ నెస్ ప్రోగ్రాం తీసుకొస్తున్నట్టు వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/