Begin typing your search above and press return to search.
5 కోట్లు గెలిచినాయన ఏం చేస్తున్నాడో తెలుసా?
By: Tupaki Desk | 15 Jun 2017 5:54 AM GMTకౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాంలో 5 కోట్లు గెలుచుకుంటే మీరేం చేస్తారు..? మీరేం చేస్తారో తెలియదు కానీ... బీహార్ లోని మెతిహారీకి చెందిన సుశీల్ కుమార్ మాత్రం ఆ డబ్బును తనతో పాటు జనం కోసం ఖర్చు చేస్తున్నాడు. పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు.
రూ.6 వేల నెల జీతానికి ఒక చిన్న ఉద్యోగం చేసుకునే సుశీల్ 2011లో కౌన్ బనేగా కరోడ్ పతిలో ఐదు కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. ఈ బహుమతి ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆయనలోని సామాజిక స్పృహకూ ఊతమిచ్చింది. 5 కోట్ల ప్రైజ్ మనీలో ట్యాక్సులు పోనూ ఆయనకు 3.6 కోట్లు రాగా అందులో కొంత మొత్తంతో ఆయన శిధిలావస్థకు చేరిన తన ఇంటికి మరమ్మతుల చేయించాడు. తన సోదరులతో కలిసి వ్యాపారం కూడా ప్రారంభించాడు. అదంతా ఆయన సొంత అవసరాలకు... ఇంకా ఏం చేశాడో తెలుసా...? 100 మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. గాంధీ బచ్ పన్ కేంద్రం పేరిట పాఠశాలను ప్రారంభించి చిన్నారులకు విద్యనందిస్తున్నాడు.
కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాంకు వెళ్లడానికి ముందు సుశీల్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసేవాడు. ఇల్లు పాడుపడిపోవడంతో, కుటుంబమంతా అద్దె ఇంట్లో ఉండేది. కేబీసీలో వచ్చిన డబ్బుతో ఇంటిని బాగుచేయించుకుని అందులోకి మారిపోయారు. ఆ తరువాత వ్యాపారం ప్రారంభించాడు. మిగిలిన సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీతో ఇంటిని నడుపుతున్నాడు. స్క్రి ప్టు రచయితగా కూడా పనిచేస్తున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/