Begin typing your search above and press return to search.
రేవంత్ హీరో కాదు.. ఓ ముమైత్ ఖాన్ః కౌశిక్ తీవ్ర వ్యాఖ్యలు
By: Tupaki Desk | 12 July 2021 5:30 PM GMTతెలంగాణ కాంగ్రెస్ బహిష్కృత నేత పాడి కౌశిక్ రెడ్డి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తనని తాను హీరోగా భావిస్తున్నారని, కానీ.. అతను ముమైత్ ఖాన్ లాగా ఉంటాడని అన్నారు. ఐటమ్ గర్ల్ ముమైత్ మాదిరిగానే ఈలలు, చప్పట్లు కొట్టించుకుంటూ.. హీరోగా ఫీలవుతున్నాడని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్న కౌశిక్.. రేవంత్ మాత్రం ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి గురించి కలలు కంటున్నారని అన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. రేవంత్ ఎంపీ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి పరిధిలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తాకట్టు పెట్టారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ.. అక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని అన్నారు. రేవంత్ రెడ్డికి, పొన్నం ప్రభాకర్ కు తాను సవాలు చేస్తున్నానని అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని ఓట్లు సాధిస్తుందో చూద్దామని, ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని అన్నారు. రాబోయే ఆర్నెల్లలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని అన్నారు.
కాగా.. కౌశిక్ రెడ్డి తీరుపై మాజీ పీసీసీ అధ్యక్షుడు, కౌశిక్ రెడ్డి సోదరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 డిసెంబర్ ఎన్నికల్లో హుజురాబాద్‌లో కాంగ్రెస్ టికెట్ ఇచ్చినందువల్లనే కౌశిక్ నాయకుడయ్యాడని అన్నారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీని, నాయకులను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. టీఆర్ఎస్ నాయకత్వం ఆదేశాల మేరకే కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్.