Begin typing your search above and press return to search.
పండ్లు మాత్రమే తినే ఈ బాబా రేప్ లకు మారుపేరు
By: Tupaki Desk | 21 Sep 2017 3:25 PM GMTకౌశలేంద్ర ప్రసన్నాచార్య ఫలహారి మహారాజ్...వయసు 70 ఏళ్లు. రాజస్థాన్ లో ఫేమస్ బాబా. ఆహారంగా ఆయన కేవలం పండ్లు తీసుకుంటాడని, ఆయనకు పలహారీ బాబా అనే పేరు వచ్చింది. ఇలా పండ్లు మాత్రమే తీసుకుంటూ చాలా సాత్వికంగా ఉండే ఈ బాబా ఇలాంటి ఆరోగ్య సూత్రాలు బోధించడు. తన శిష్యులకు సహాయం చేస్తున్నట్లుగానే చేసి...మాయ మాటలు చెప్పి అత్యాచారం చేస్తాడు. ఇలా ఫలహారి బాబా చేతిలో అనేక మంది మోసపోయారు. ఇలా లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆశ్రమంలోని ఓ మహిళ (21) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన గుట్టు రట్టయింది.
బాబాల ముసుగులో మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. గతంలో ఆశారాం బాబా - ఇటీవల రాంరహీం గుర్మీత్ సింగ్ - తాజాగా రాజస్థాన్ లో ప్రఖ్యాత ఫలహారి బాబాపై లైంగికదాడి కేసు నమోదైంది. ఆగస్టు ఏడో తేదీ రాత్రి గదికి పిలిపించుకొని తనపై లైంగికదాడి చేశారని, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. దీంతో ఫలహారి బాబాపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు ఆశ్రమానికి వెళ్లగా ఆయన హైబీపీతో బాధపడుతూ దవాఖానలో చేరినట్టు సిబ్బంది తెలిపారు. దవాఖానలో చికిత్స పొందుతున్న బాబా ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఆయన కోలుకున్న తర్వాత విచారణ జరుపుతామని పోలీసులు చెప్పారు.
బాబా సిఫారసుతో ఢిల్లీలో సీనియర్ లాయర్ వద్ద జూనియర్ గా చేరిన ఆ మహిళ నెలకు రూ. 3000 స్టయిఫెండ్ పొందుతున్నారు. అయితే, ఆశ్రమానికి కొంత డబ్బులు విరాళం ఇచ్చేందుకు వచ్చారు. పలుమార్లు బాబా కూడా ఆమె నివాసానికి వెళ్లినట్టు తెలిసింది. ఫలహారి బాబాకు దేశ - విదేశాల్లోనూ భక్తులున్నారు. కాషాయంతోపాటు తెల్లవస్త్రాలు సైతం ధరించే ఈ బాబా ఆశీర్వాదం పొందేందుకు రాజకీయ నాయకులతోపాటు ప్రముఖులు సైతం బారులు తీరుతారు. అలాంటి బాబా అసలు రూపం తాజాగా బయటపడిందని అంటున్నారు.