Begin typing your search above and press return to search.

కోండ్రుకు తొడ దెబ్బ : ఒక్కసారి పెరిగిన ఇమేజ్ తో పోటీ...?

By:  Tupaki Desk   |   1 Jun 2022 11:30 PM GMT
కోండ్రుకు తొడ దెబ్బ : ఒక్కసారి పెరిగిన ఇమేజ్ తో పోటీ...?
X
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రాజాం సీటు తెలుగుదేశం గెలుచుకునే అవకాశాలు ఈసారి గట్టిగా ఉన్నాయి. ఇక్కడ రెండు సార్లుగా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులు మీద వ్యతిరేకత అంతకంతకు పెరిపోతోంది. ఆయన కూడా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే అసలు చేయడంలేదు. మరో వైపు చూస్తే ప్రత్యర్ధి టీడీపీ బలం బాగా పుంజుకుంది.

ఆ పార్టీకి బలమైన నేతలు ఉన్నాయి. ఇక రాజాం నుంచి 2009 ఎన్నికల్లో గెలిచిన కోండ్రు మురళీ మొహనరరావు కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. ఆయన 2014 తరువాత టీడీపీలో చేరారు. ఆయనకు సొంత క్యాడర్ ఉంది. టీడీపీ కూడా స్ట్రాంగ్ గా ఉండడంతో కోండ్రు విజయం ఖాయం అనుకుంటున్నారు.

ఇక 2019 ఎన్నికల్లోనే ఆయన గెలిచి తీరాలి కానీ జగన్ వేవ్ అడ్డుపడిపోయింది. ఈసారి హరి మీద గిరి పడ్డా తన విజయాన్ని ఎవరూ ఆపలేరేని ఆయన, ఆయన అనుచరులు కూడా ధీమాతో ఉన్నారు. ఈ మధ్యనే రాజాం వచ్చిన నారా లోకేష్ బాబు ఎదుటనే తన బలం ఏంటో కోండ్రు చూపించి చినబాబు మెప్పు పొందేశారు.

వ్యక్తిగత పర్యటనకు రాజాం వచ్చిన చినబాబును రోడ్ షో పేరిట జనంలోకి తీసుకెళ్ళి ఫుల్ ఖుషీ చేశారు. దారికి ఇరువైపులా జనమే జనంగా అంతా కనిపించడంతో పొంగిపోయిన లోకేష్ బాబు కోండ్రుకు టికెట్ హామీ ఇచ్చేశారు అని పార్టీ వర్గాలలో వినిపించింది. అయితే అదే సీటుని ఆశిస్తున్న మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మ మాత్రం ఆ పరిణామాలతో డల్ అయ్యారు.

దాంతో సరైన సమయం కోసం ఎదురుచూసిన ఆమె మహానాడు సాక్షిగా వేదిక మీద మాట్లాడే చాన్స్ దక్కడంతో ఆవేశపూరితమైన స్పీచ్ ఇచ్చేశారు. అంతే కాదు తొడకొట్టి మరీ ఏకంగా మహానాడుకే కాదు ఏపీనే షేక్ చేసేశారు. దాంతో ఇపుడు ఎక్కడ చూసినా గ్రీష్మ పేరు మారుమోగుతోంది.

ఆమె పవర్ ఫుల్ స్పీచ్ కి టీడీపీ హై కమాండ్ ఫిదా అయిందని అంటున్నారు. ఒక సోషల్ మీడియా అయితే ఆమెను ఒక్క లెక్కన ఎత్తేస్తోంది. తెలుగు తమ్ముళ్లు గ్రీష్మ లాంటి లీడర్స్ ఇపుడు కావాలి అంటున్నారుట. దాంతో రాజాం సీటు విషయంలో కోండ్రుకు గ్రీష్మ ఫుల్ కాంపిటేషన్ ఇచ్చేస్తున్నారు.

అయితే దీని వెనక ఇద్దరు టీడీపీ పెద్దల మార్క్ పాలిటిక్స్ ఉందని అంటున్నారు. ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు టీడీపీలోకి తీసుకువచ్చిన నేత కోండ్రు మురళీమోహనరావు. అక్కడ కళాకు మంచి పట్టు ఉంది. దాంతో తన మనిషికి టికెట్ తెప్పించుకుని గెలిపించుకోవాలని కళా తాపత్రయపడ్డారని, దాని ఫలితమే చినబాబు రాజాం రోడ్ షో అంటున్నారు.

ఇక కళాకు ఎదురు నిలిచి టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మరో వ్యూహాన్ని రూపొందించారు. ఆయన గ్రీష్మకు మహానాడులో మాట్లాడే అవకాశం ఇప్పించడం ద్వారా టోటల్ స్టేట్ ఆమె గురించి మాట్లాడుకునేలా చేశారు అంటున్నారు. దాంతో మహిళా కోటాలో, మాజీ స్పీకర్ వాటాలో గ్రీష్మకు టికెట్ కచ్చితంగా దక్కుతుందని ఆమె వర్గం అంటోంది. మొత్తానికి మహానాడు తొడ దెబ్బ కోండ్రు టికెట్ కి దెబ్బెస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.