Begin typing your search above and press return to search.

డీకే అరుణ జంపింగ్‌ పై క్లారిటీ ఇచ్చిన ఎంపీ క‌విత‌

By:  Tupaki Desk   |   1 Nov 2016 4:21 AM GMT
డీకే అరుణ జంపింగ్‌ పై క్లారిటీ ఇచ్చిన ఎంపీ క‌విత‌
X
తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌ తో పాటు టీఆర్ ఎస్‌ పై విప‌క్ష కాంగ్రెస్‌ కు చెందిన నాయ‌కుల్లో తిట్టిన తిట్టు తిట్ట‌కుండా విమ‌ర్శ‌లు చేసేది ఎవ‌రంటే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణే అని చెప్పాలి. కాంగ్రెస్‌లో ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి - జానారెడ్డి - భ‌ట్టీ విక్ర‌మార్క ఇలా చెప్పుకుంటూ పోతే సీనియ‌ర్ల లిస్ట్ చాలా పెద్ద‌దే.. అయితే కేసీఆర్‌ పై విమ‌ర్శ‌ల విష‌యంలో వారంద‌రి నోళ్లు ఎందుకో గాని అంత ప‌వ‌ర్ ఫుల్‌ గా పెగ‌ల‌వు. డీకే అరుణ మాత్రం కేసీఆర్ అన్నా - టీఆర్ ఎస్ అన్నా రెచ్చిపోయి మ‌రీ విమ‌ర్శ‌లు చేస్తారు.

అలాంటి డీకే అరుణ కొద్ది రోజులుగా టీఆర్ ఎస్‌ - కేసీఆర్‌ పై విమ‌ర్శ‌ల విష‌యంలో చాలా సైలెంట్ అయిపోయారు. ఆమె కోరుకున్న‌ట్టు ప్ర‌త్యేక గ‌ద్వాల్ జిల్లా ఏర్పాటు చేయ‌డంతో అరుణ కారెక్కేస్తారని కూడా కొద్ది రోజులుగా ఊహాగానాలు వ‌స్తున్నాయి. అయితే ఈ విష‌యాన్ని ఆమె ఖండించినా ఆ ఖండ‌న‌లో ఎలాంటి స్ట్రాంగ్ నెస్ లేదు. ఆమె పార్టీ మార్పుపై ఊహాగానాలు ఆగ‌లేదు.

ఇదిలా ఉంటే తాజాగా సీఎం కేసీఆర్ కుమార్తె - నిజామాబాద్ ఎంపీ క‌విత డీకే అరుణ త్వ‌ర‌లోనే టీఆర్ ఎస్‌ లో చేర‌తాని ప్ర‌క‌టించ‌డంతో టీ పాలిటిక్స్ ఒక్క‌సారిగా హీటెక్కేశాయి. అరుణ ఇప్ప‌టికే పార్టీలో చేరాల్సి ఉన్నా..కొన్ని కార‌ణాల వ‌ల్ల అది కుద‌ర్లేద‌ని..ఆమె త్వ‌ర‌లోనే పార్టీ మార‌నున్నార‌ని మీడియాతో చెప్ప‌డంతో టీ కాంగ్రెస్‌ లో ఒక్క‌సారిగా నిర్వేదం అల‌ముకున్న‌ట్ల‌య్యింది.

వాస్త‌వానికి గ‌ద్వాల జిల్లా ఏర్పాటుకు ముందు వ‌ర‌కు చూసుకుంటే అరుణ కేసీఆర్‌ పై ఓ రేంజ్‌ లో విరుచుకుప‌డేవారు. తాను ప్రాధినిత్యం వ‌హిస్తున్న గ‌ద్వాల్ జిల్లా డిమాండ్‌ ను కేసీఆర్ ముందు ప‌ట్టించుకోలేదు..త‌ర్వాత ఆమె రాజీనామా లేఖ ఇవ్వ‌డంతో చివ‌ర్లో గ‌ద్వాల్ జిల్లా ఏర్పాటు చేసేశారు. అక్క‌డి నుంచి అరుణ రాజ‌కీయం మ‌లుపు తిరిగిన‌ట్టు టాక్‌.

అయితే అరుణ పార్టీ మారుతున్న విష‌యంలో మీడియాలో జోరుగా చ‌క్కెర్లు కొడుతోంది. మ‌రి ఈ విష‌యంపై ఆమె కూడా క్లారిటీ ఇచ్చేస్తే స్ప‌ష్ట‌త వ‌స్తుంది. లేక‌పోతే అరుణ‌పై క‌విత చేసిన వ్యాఖ్య‌లు ఆమెను డిఫెన్స్‌ లో ప‌డేసేందుకేనా ? అన్న డౌట్లు కూడా రాక‌మాన‌వు. ఎందుకంటే టీఆర్ ఎస్ గ‌తంలో కూడా ఎంతో మంది ప్ర‌జా ప్ర‌తినిధులు పార్టీ మార‌కుండానే ముందుగా మీడియాలో వారు పార్టీ మారుతున్న‌ట్టు బ్రేకింగు న్యూస్‌ లు - స్టోరీలు వేయించిన‌ట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. మ‌రి అరుణ టీఆర్ ఎస్ ఎంట్రీ ఎలా మ‌లుపులు తిరుగుతుందో ఇప్పుడు టీ పాలిటిక్స్‌ లో పెద్ద ఆస‌క్తిగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/