Begin typing your search above and press return to search.
కవితకు ఆయన అంత ఖాళీగా కనిపిస్తున్నాడా?
By: Tupaki Desk | 27 Aug 2016 7:13 AM GMTహైదరాబాదు రాజకీయాల్లో అప్పుడప్పుడూ మాత్రమే కనిపించే నాయకురాలు అయినా సరే.. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎడాపెడా తూర్పారపట్టడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలి కలిగిఉన్న నాయకురాలు కల్వకుంట్ల కవిత. తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో జరిగిన ఒప్పందాలు అనేవి తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న నేపథ్యంలో తెరాస తరఫున వకాల్తా పుచ్చుకుంటూ.. తమను తప్పు పడుతున్న వారిని ఏకిపారేయడానికి ఆమె తాజాగా ముందుకు వచ్చింది.
ఈ క్రమంలో భాగంగా తమ రాజకీయ ప్రత్యర్థులందరినీ విమర్శించడం ఒక ఎత్తు. అదే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని విమర్శించడం మరో ఎత్తు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతున్నదని, టెండర్లు తెరవడానికి ముందే, పనులు ఎవరికి అప్పగించాలో ఖరారైపోయిందని .. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రాజెక్టుల డిజైన్ లను మార్చడాన్ని తప్పుపడుతున్నారు. తన సహజమైన శైలిలో కేసీఆర్ కు చికాకు పుట్టిస్తున్నారు.
అందుకే రేవంత్ మీద కవిత కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుంది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు అసలేమీ వర్క్ లేదని .. అందుకే పనిలేక - పసలేని ఆరోపణలు చేస్తున్నాడని రిటార్టు ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఆమెకు మరీ అంత ఖాళీగా కనిపిస్తున్నాడా అని నాయకులు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. రేవంత్ ఒకవైపు తెదేపాను వచ్చే ఎన్నికల వరకు కాపాడే బాధ్యత మొత్తం తన మీదే ఉన్నట్లుగా కష్టపడుతోంటే.. ఈ గులాబీ బాల మాత్రం ఏకంగా.. అసలాయనకు పనేమీ లేదని వ్యాఖ్యానించడం తమాషా విషయమే.