Begin typing your search above and press return to search.

ఓల‌మ్మ.. క‌విత‌మ్మ ఈ ఆంధ్రా గోలేంది..?

By:  Tupaki Desk   |   20 July 2015 9:14 AM GMT
ఓల‌మ్మ.. క‌విత‌మ్మ ఈ ఆంధ్రా గోలేంది..?
X
విభ‌జ‌న జ‌రిగిపోయింది. ఎవ‌రి బ‌తుకులు బతుకుదామ‌ని ఎవ‌రికి వారు ఫిక్స్ అయిపోయిన‌ప్ప‌టీ తెలంగాణ అధికార‌ప‌క్ష నేత‌ల‌కు మాత్రం ఆంధ్రా.. ఆంధ్రా అన్న జ‌పాన్ని మాత్రం వ‌ద‌ల‌టం లేదు. వారి ఇంటిని చూసుకునే క‌న్నా.. ప్ర‌తివిష‌యానికి ఆంధ్రా పేరును ప్ర‌స్తావించ‌టం మాత్రం ఎక్కువైంది.

త‌మ‌కు అగ్ర‌హం వ‌స్తే ఆంధ్రా.. తాము విమ‌ర్శ చేయాలంటే ఆంధ్రా అంటూ.. నిత్యం ఆంధ్రా నామ స్మ‌ర‌ణ చేయ‌టం ఓ అల‌వాటుగా మారింది. మిగిలిన వారితో పాటు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ క‌విత సంగ‌తి కాస్త ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఆమె ఎవ‌రిని విమ‌ర్శించాల‌న్నా ఆంధ్రానే గుర్తుకు వ‌స్తుంది.

తాజాగా ఆమెకు క‌మ్యూనిస్టుల మీద కోపం వ‌చ్చింది. తెలంగాణ‌లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు నాయ‌క‌త్వం వహించి తెలంగాణ స‌ర్కారు మీద ఒత్తిడి తీసుకొచ్చి.. తాము అనుకున్న డిమాండ్ల‌ను సాధించుకోవ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆమె క‌మ్యూనిస్టుల మీద క‌స్సుమ‌న్నారు. అయినా.. స‌మ‌స్య‌ల‌న్నీ తెలంగాణ‌లోనే ఉన్న‌ట్లు..ఆంధ్రాలో లేనట్లుగా క‌మ్యూనిస్టులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

కార్మికుల స‌మ‌స్య‌లు ఒక్క తెలంగాణ‌లోనే క‌నిపిస్తున్నాయా? ఆంధ్రాలో లేవా? అంటూ ప్ర‌శ్నించిన ఆమె.. తెలంగాణ‌లో ఆందోళ‌న‌లు చేస్తున్న క‌మ్యూనిస్టులు ఆంధ్రాలో మాత్రం కామ్ గా ఉంటున్నార‌ని విరుచుకుప‌డ్డారు.
విభ‌జ‌న జ‌రిగిపోయిన త‌ర్వాత‌.. ఎవ‌రి ఇంటిని వాళ్లు చూసుకుంటే మంచిది. ఎవ‌రి మీద కోపం వ‌చ్చినా.. ఆంధ్రాను మాట‌ల మ‌ధ్య‌లోకి తీసుకురావ‌టం క‌విత‌మ్మ‌కు మాత్ర‌మే సాధ్య‌మేమో. అయినా.. సొంత రాష్ట్ర స‌మ‌స్య‌ల గురించి మాట్లాడ‌కుండా.. ఆంధ్రా ప్ర‌స్తావ‌న ఎందుకు? ఆంధ్రాను ఏదో ఒక మాట అన‌క‌పోతే.. క‌విత‌మ్మ మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉండ‌దా?