Begin typing your search above and press return to search.
కేటీఆర్ కు కొత్త బైక్ కొనివ్వనున్న ఎంపీ కవిత
By: Tupaki Desk | 29 July 2017 10:16 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడైన మంత్రి కేటీఆర్ - కుమార్తె ఎంపీ కవిత మధ్య ఉండే సఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్నాచెల్లెళ్లు కలివిడిగా ఉంటారని పార్టీ వర్గాలు చెప్తుంటాయి. అన్యోన్యంగా ఉండే ఈ అన్నాచెల్లెళ్లకు రాబోయే రాఖీ పండుగ సో స్పెషల్ కానుందట. ఎందుకంటే రాఖీపండుగ సందర్భంగా కేటీఆర్ కు ఎంపీ కవిత బైక్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. ఔనా! మంత్రిగా ఉన్న కేటీఆర్ కు సాఫీగా సాగిపోయే కాన్వాయ్ ఉన్నపుడు ప్రత్యేకంగా బైక్ ఎందుకు అంటారా? ఇందుకు ఎంపీ కవిత క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఆయన సోదరి కవిత కొత్త కార్యక్రమం ఒకటి శ్రీకారం చుట్టారు. సిస్టర్ ఫర్ చేంజ్ పేరుతో రాబోయే రాఖీ పండగ సందర్భంగా అక్కాచెల్లెల్లు తన సోదరుడికి రాఖీ కట్టడంతో పాటు హెల్మెట్ కూడా ఇవ్వాలట. ఎందుకు అంటే ఎంపీ కవిత ఆసక్తికరమైన రిప్లై ఇచ్చారు. ``హెల్మెట్ లేకపోవడం ప్రతిరోజు దేశవ్యాప్తంగా 400 వందల మంది యువకులు వల్ల రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతున్నారు. ఈ పరిణామం నన్ను ఆలోచనలో పడేసింది. అందుకే నా సోదరుడి పుట్టినరోజు సందర్భంగా సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. రాబోయే రాఖీ సందర్బంగా ప్రతి చెల్లి రాఖీతో పాటు హెల్మెట్ ఇవ్వండి. మనకు అన్న రక్ష ...అన్నకు హెల్మెట్ రక్ష`` అని కవిత తెలిపారు.
తాను చేస్తున్న సిస్టర్ ఫర్ చేంజ్ నినాదానికి చాలా మంది స్పందిస్తున్నారని ఎంపీ కవిత వెల్లడించారు. ఈ క్యాంపెయిన్‌కు జాతీయ స్థాయి ప్రచారం చేస్తున్నానని ఎంపీ కవిత తెలిపారు. దీనికి మీడియా సైతం సహకరించాలని ఆమె కోరారు. ఇంతకు మీ కుటుంబంలో ఈ కార్యక్రమాన్ని ఎలా చేస్తారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కవిత స్పందిస్తూ ``మా అన్న కేటీఆర్ కు బైక్ లేదు. కనుక హెల్మెట్ తో పాటు బైక్ కూడా గిఫ్ట్ ఇస్తాను. అంతేకాదు కారులో ప్రయాణించే సమయంలో సీట్ బెల్ట్ కూడా పెట్టుకోమని చెప్తాను.`` అని కవిత ముక్తాయించారు. అంటే రాబోయే రాఖీ పండగకు కేటీఆర్ రాఖీతో పాటు రైడింగ్‌కు అనువైన బైక్ కూడా రానుందన్న మాట.