Begin typing your search above and press return to search.
60 ఏళ్ల ఐఐటీ మద్రాస్ చరిత్రలో ఆమె ఓ రికార్డ్
By: Tupaki Desk | 2 Oct 2019 5:49 AM GMTదేశంలోని ప్రతిష్ఠాత్మక క్యాంపస్ లలో ఐఐటీలను చెబుతుంటారు. అలాంటి ఐఐటీల్లో మద్రాస్ క్యాంపస్ కున్న పేరు ప్రఖ్యాతులు తక్కువేం కాదు. ఆ క్యాంపస్ అరవైఏళ్ల చరిత్రను బ్రేక్ చేసిందో అమ్మాయి. ఇప్పటివరకూ మరే యువతి సాధించని అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని రికార్డుగా మారారు కవితా గోపాల్.
మద్రాస్ ఐఐటీ స్నాతకోత్సవంలో 21 ఏళ్ల తమిళనాడుకు చెందిన కవితా గోపాల్ రాష్ట్రపతి బంగారు పతకాన్ని సాధించి హిస్టరీ క్రియేట్ చశారు. 60 ఏళ్ల మద్రాస్ ఐఐటీలో తొలిసారి ఈ ఘనతను సాధించిన అమ్మాయిగా ఆమె నిలిచారు. అంతేకాదు.. మరో రరెండు అవార్డులను సొంతం చేసుకున్నారు.
తమిళనాడులోని కాంచీపురం జిల్లా అణుపురంలోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూలు.. కల్పాకంలోని కేవీవీలో చదివిన కవిత 2015లో ఐఐటీ మద్రాస్ లో సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్)లో చేరారు. ప్రస్తుతం ఆమె గూగుల్ లో ఐటీ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.
మద్రాస్ ఐఐటీలో సీఎస్ ఈలో 9.95 గ్రాండ్ స్కోర్ తో రికార్డు క్రియేట్ చేయటమే కాదు.. ఎం. విశ్వేశ్వరయ్య స్మారక పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ అవార్డును సొంతం చేసుకున్న తొలి మహిళగా ఆమె అవతరించారు. మూడు అవార్డుల్ని పొందటంపై ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.