Begin typing your search above and press return to search.
రాజకీయాలకు దూరంగానే కవిత...
By: Tupaki Desk | 15 Dec 2019 2:30 PM GMTముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురిగా.. ఎంపీగా అటు ఢిల్లీలో.. ఇటు రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కవిత ప్రస్తుతం రాజకీయాలను పూర్తిగా పక్కకు పెట్టేశారు. మెట్టినిల్లుగా భావించి జిల్లాలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తే ప్రజలు ఏమాత్రం అర్థం చేసుకోకుండా పార్లమెంటు ఎలక్షన్లలో చివరికి తననే ఓటమి పాలు చేశారాని తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల సమయంలో కొంతమంది కీలక నేతలు కూడా కవితకు నమ్మక ద్రోహం చేసినట్లుగా తేలడంతో ఆమె వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదంట. నిజామాబాద్ రాజకీయాల్లో అన్నీతానై మెదిలిన కవిత ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు.
ఆమె అతి కొద్దిమంది నేతలకు మాత్రమే టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీయే అధికారంలో ఉన్నా ఏ విషయంపైనా ఆమె స్పందించకపోవడం గమనార్హం. కవిత మౌనం వెనుక కేసీఆర్ వ్యూహాలున్నాయనే రాజకీయ విశ్లేషకుల మాట. ఆమె మరోసంవత్సరం పాటు ఇలా ఇంటికే పరిమితమవుతారని - ఆ తర్వాతే మళ్లీ ఆక్టివ్ అవుతారనే వాదన వినిపిస్తున్నా వారూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఆమె వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకే పోటీ చేస్తారని - త్వరలోనే నియోజకవర్గ మార్పు గురించి వార్త వస్తుందన్న ప్రచారం నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో జరుగుతుండటం విశేషం.
వాస్తవానికి కేసీఆర్ సూచన మేరకు కవిత మౌనంగా ఉంటున్నట్లుగా కూడా టీఆర్ ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కవిత ఓటమి ఆమె కంటే ఎక్కువగా కేసీఆర్‌ను బాధించిందట. వాస్తవానికి కేవలం కేసీఆర్ పేరు చెబితేనే ఒక్కో నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లు ఎమ్మెల్యేలు వశమయ్యాయి. అట్లాంటిది తన కూతురు కవిత ఓటమిని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారని టీఆర్ ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలు జరిగి దాదాపు పది నెలలు కావస్తున్నా ఆమె రాజకీయాలకు దూరంగా ఉండటం వెనుక కేసీఆర్ సూచనలే కారణమని సమాచారం.
అయితే వచ్చే ఏడాది రాజ్యసభ పదవులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో కవితను ఎంపిక చేసే అవకాశం ఉందని టీఆర్ ఎస్ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీనికి కవిత అంగీకరించకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. పరోక్షంగా ఆమె రాజ్యసభకు ఎంపికయ్యేందుకు ఇష్టపడడం లేదని టాక్. మరి కవిత ఫ్యూచర్ కేసీఆర్ ఎలా డిసైడ్ చేస్తారో ? చూడాలి.