Begin typing your search above and press return to search.
హిజాబ్ రచ్చకు 'కవిత'తో ట్విస్ట్ ఇచ్చిన కవిత
By: Tupaki Desk | 10 Feb 2022 7:34 AM GMTకర్నాటకలో హిజాబ్ వివాదం ముదురుపాకాన పడుతోంది. స్థానకంగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు జాతీయ స్థాయి నేతలను మొదలుకొని పాకిస్తాన్ వంటి ఇతర దేశాల నాయకులు స్పందించే వరకు చేరింది. అయితే, ఈ వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళల వస్త్రధారణ, హిజాబ్ వివాదం విషయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చేతితో రాసిన కవితను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కవిత స్త్రీలు సృష్టికర్తలు .. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని అన్నారు.
హిజాబ్ వివాదంపై స్పందిస్తూ నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు.. హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్చ అవుతుందని కల్వకుంట్ల కవిత తెలిపారు. తాము ఎలా ఉండాలి ? ఏం ధరించాలి? ఏం చేయాలి? అన్న విషయాలను మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని కవిత సూచించారు. కాగా, కవిత చేసిన వ్యాఖ్యలతో పాటుగా ఆమె పోస్ట్ చేసిన కవిత సైతం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్సీ కవిత తన స్వహస్తాలతో రాసి పోస్ట్ చేసిన `కవిత` ఇది..
హిందూ-ముస్లిం-సిక్కు-క్రిస్టియన్...
మతం ఏదైనా సరే…
మనమంతా భారతీయులమే..
సిందూర్-టర్బన్-హిజాబ్-క్రాస్
ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే…
‘త్రివర్ణ పతాకాన్ని’ రూపొందించిన పింగళి వెంకయ్య అయినా..
‘జై హింద్’ అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ అయినా..
‘సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్’ అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్ ఇక్బాల్ అయినా..
‘జన గణ మన’తో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా..
మనకు చెప్పింది ఒక్కటే..
మనం ఎవరైనా… మనమంతా భారతీయులమనే.. !!