Begin typing your search above and press return to search.
‘యోగా’ బాబాను కవితక్క ఎందుకు కలిశారు?
By: Tupaki Desk | 17 Sep 2016 4:46 AM GMTపోటీ అంటే పోటీ అన్నట్లుగా వ్యవహరించటం అంత తేలికైన వ్యవహారం కాదు. తమ పోటీదారు తమకంటే ఒక్క అడుగు ముందుకేసినా సహించలేని తత్వం మామూలు విషయం కాదు. ఎంతో కసి.. పట్టుదల ఉన్నోళ్లు మాత్రమే చేయగలరు. ఇలాంటి అంశాల్ని ఎవరికి వారు.. వారి దృష్టి కోణంలో నుంచి మాత్రమే చూస్తారు. పాజిటివ్ దృక్పథం ఉన్నోళ్లు.. పోటీ మంచిదే కదా? అన్నట్లు ఫీలవుతారు. కానీ.. నెగిటివ్ దృష్టి కోణం ఉన్నోళ్లు ఇలాంటివి పెద్ద తప్పులుగా భావిస్తారు.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్య అప్రకటిత పోటీ ఒకటి షురూ అయ్యింది. ఇద్దరూ ఒకరికంటే ఒకరు వేగంగా దూసుకెళ్లాలన్న తపన మొదలైంది. ఇది ఎంతవరకు వెళ్లిందంటే.. అధినేతల నుంచి.. ప్రభుత్వ అధికారుల వరకు వెళ్లింది. పరీక్షా ఫలితాల్ని విడుదల చేసే విషయంలోనూ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి.. ఒకరి కంటే మరొకరు ముందుగా ఫలితాల్ని విడుదల చేసి.. వాళ్ల కంటే మేమే ముందు అన్న విషయాన్ని ఫలితాల విడుదలతో స్పష్టం చేస్తున్నపరిస్థితి.
సోమరితనానికి కేరాఫ్ అడ్రస్ గా ఫీలయ్యే ప్రభుత్వ అధికారుల్లోనే ఇంత పోటీ తత్వం పెరిగితే.. ప్రభుత్వాల పరిస్థితి మరెలా ఉంటుందో? ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏపీకి ఏదైనా కేంద్రం ప్రకటిస్తే.. వెనువెంటనే తెలంగాణ సర్కారు కేంద్రాన్ని సంప్రదించటం కామన్ గా మారింది. ఇదే తీరు తెలంగాణ విషయంలో ఏపీ సర్కారు కూడా వ్యవహరిస్తుందని చెప్పక తప్పదు.
తాజాగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. టీఆర్ ఎస్ ఎంపీ కవిత కలిశారు. ఈ సమావేశం పలువురిలో ఆసక్తిని రేకెత్తించింది. బాబా రాందేవ్ ను యోగా గురువుగా మాత్రమే చూస్తే తప్పులో కాలేసినట్లే. కాషాయ వస్త్రాలు వేసుకొని తిరిగే బాబా రాందేవ్ వేల కోట్ల రూపాయిల ఉత్పత్తుల్ని తయారు చేసే పారిశ్రామికవేత్త. పతంజలి బ్రాండ్ తో ఎఫ్ఎంసీజీ మార్కెట్లో దౌడు తీస్తున్న ఆయన దెబ్బకు ప్రత్యర్థులు వణికిపోతున్న పరిస్థితి. అలాంటి బాబా రాందేవ్ తో కవితక్క భేటీ కావటంపై ఆసక్తి వ్యక్తమవుతోంది. పైకి చూస్తే.. దేశంలో పసుపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని బాబా రాందేవ్ దృష్టికి తెచ్చినట్లుగా చెబుతున్నారు.
ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం లేని బాబా రాందేవ్ దృష్టికి కవితక్క పసుపు రైతుల సమస్యను తీసుకొచ్చారా? అన్నడౌట్ రాక మానదు. దీనికి బలం చేకూరేలా వార్తలు వస్తున్నాయి. ఇటీవల బాబా రాందేవ్ తన పతంజలి ఉత్పత్తి కేంద్రాల్ని దేశ వ్యాప్తంగా ఐదారు చోట్ల ఓపెన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిన ఏపీలోని నాయుడుపేటలో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన రెండు.. మూడు రోజులకే బాబా రాందేవ్ తో కవితక్క భేటీ కావటం గమనార్హం. ఈ మీటింగ్ వెనుక పసుపురైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కంటే కూడా.. పతంజలి సంస్థ విస్తరణలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ ను నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని బాబాను కవితక్క కోరినట్లు తెలిసింది. పతంజలి ఉత్పత్తి సంస్థను నిజామాబాద్ లో ఏర్పాటు చేయాలంటూ కవితక్క డిమాండ్ పై బాబా రాందేవ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.