Begin typing your search above and press return to search.

సంచలనం : ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో కవిత పేరు

By:  Tupaki Desk   |   30 Nov 2022 4:18 PM GMT
సంచలనం : ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో కవిత పేరు
X
కేంద్రంలోని ఈడీ మరో సంచలనానికి తెరతీసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇక అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో మరోసారి కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి రావడం టీఆర్ఎస్ వర్గాలకు షాకింగ్ గా మారింది. బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు, వ్యాపారవేత్త అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు రావడంతో ఢిల్లీ మద్యం కుంభకోణం అనూహ్య మలుపు తిరిగింది.

అరెస్టు తర్వాత, ఈడీ అమిత్ అరోరాను ప్రశ్నించింది. అతని వాంగ్మూలం ఆధారంగా రిమాండ్ నివేదికను తయారు చేసి న్యూఢిల్లీలోని కోర్టులో సమర్పించింది. రిమాండ్ రిపోర్ట్ కాపీ ప్రధాన స్రవంతి మీడియా కోసం ఇవ్వగా.. అందులో 100 కోట్ల రూపాయలను బదిలీ చేయడంలో కవిత భారీ పాత్ర పోషించిందని ఈడీ ఆరోపించింది.

32 పేజీల రిమాండ్ రిపోర్టులో కవిత పేరును మూడుసార్లు పేర్కొన్న ఈడీ, ఆమె పది మొబైల్స్ వాడినట్లు పేర్కొంది. ఈడీ వద్ద మొబైల్ ఫోన్‌ల ఐఎంఈఐ నంబర్లు ఉన్నాయి. ఈ స్కామ్‌లో కీలకమైన సాక్ష్యంగా ఉన్న ఫోన్‌లను ధ్వంసం చేయడానికి కవిత ప్రయత్నించారని ఈడీ ఆరోపించింది.

శరత్‌చంద్రారెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలోని సౌత్‌ గ్రూప్‌ నుంచి రూ.100 కోట్ల బదిలీ జరిగిందని తేలింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు ప్రస్తావించడం ఇదే మొదటిసారి. ఈ రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొన్నట్లుగా, కవిత ప్రమేయం ఉంటే త్వరలోనే ఆమెకు నోటీసులు అందజేయడం.. విచారించడం ఖాయం అని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీపై గుర్రుగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు కవితను ఈ కేసులో ఇరికిస్తే ఎలాంటి ముందడుగు వేస్తాడన్నది హాట్ టాపిక్ మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.