Begin typing your search above and press return to search.

హైదరాబాద్ క్రికెట్ బాగు కోసం కవిత ఎంట్రీ?

By:  Tupaki Desk   |   23 March 2021 6:30 AM GMT
హైదరాబాద్ క్రికెట్ బాగు కోసం కవిత ఎంట్రీ?
X
అవినీతి ఆరోపణలు.. జట్టు ఎంపికలో అవకతవకలు, పక్షపాతం, ఆడిటింగ్ జరగకపోవడం సహా ఎన్నో ఆరోపణలతో టీమిండియా మ్యాచ్ ల నిర్వహణకు కూడా దూరమవుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నజర్ పెట్టినట్టు తెలిసింది. ఈ మేరకు హెచ్.సీ.ఏలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట..

ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సీ.ఏ) అధ్యక్షుడు అజారుద్దీన్, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ శివలాల్ మధ్య వివాదాలు చెలరేగాయి. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెట్లో హైదరాబాద్ టీం తేలిపోయి దేశవాళిలో ఘోరంగా ఓడిపోవడం.. ఆటగాళ్ల ఎంపికలో ఫైరవీలు చోటుచేసుకోవడం వల్లేనని.. మంచి ఆటగాళ్లను ఎంపిక చేయలేదని..లంచాలు తీసుకొని అనర్హులను ఎంపిక చేశారన్న ఆరోపణలు వచ్చాయి.

క్రికెట్లో హైదరాబాద్ పేరు ఆటకంటే ఎక్కువగా వివాదాల్లోనే వినిపిస్తుండడంతో తెలంగాణ సర్కార్ దీనిపై నజర్ పెట్టింది. కేసీఆర్ సైతం హైదరాాబాద్ కు ఐపీఎల్ నిర్వహణ రాకపోవడంపై సీరియస్ అయినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే కేసీఆర్ కూతురు కవిత హెచ్.సీ.ఏపై దృష్టిపెట్టాలని భావిస్తున్నారట.. ఐపీఎల్ ఆతిథ్య వేదికల్లో హైదరాబాద్ కు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. హెచ్.సీ.ఏను ప్రక్షాళన చేయాలని కవిత భావిస్తోందట..

హైదరాబాద్ క్రికెట్ లో అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి .. ప్రతిభావంతులకు అండగా నిలవాలని భావించి ఈ దిశగా కసరత్తు మొదలుపెట్టారట.. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్అభివృద్ధి.. గ్రామీణ క్రీడాకారులకు అవకాశాలు ఎలా కల్పించాలనే దానిపై క్రికెట్ మేధావులతో కవిత చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. హెచ్.సీ.ఏను గాడిన పెట్టకపోతే తెలంగాణ క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే క్రికెట్ వ్యవహారాలపై కవిత దృష్టి సారించబోతున్నారట..