Begin typing your search above and press return to search.
కేటీఆర్ ట్వీట్ లెక్కపై క్లారిటీ వచ్చేసింది
By: Tupaki Desk | 4 Oct 2019 5:17 AM GMTకల్వకుంట్ల కవితకు ముందు నుంచే బతుకమ్మ తెలంగాణలో ఉంది. అయితే.. దానికో క్రేజ్ తీసుకొచ్చి.. దాన్నో సంబరంగా మార్చటంలో ఆమె పాత్రను తక్కువ చేసి చూపించలేం. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన కవిత కారణంగా.. బతుకమ్మ వేడుక భారీ ఎత్తున సాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో మహిళల్ని ఉద్యమంలోకి తీసుకురావటంలో బతుకమ్మ కీలకభూమిక పోషించింది. అంతేనా.. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తం చేయటంలోనూ కవితక్క కీలకమైంది.
ఒక దశలో బతుకమ్మ అంటే కవిత.. కవిత అంటే బతుకమ్మగా ఫీలైనోళ్లు లేకపోలేదు. కవిత చుట్టూనే బతుకమ్మ హడావుడి ఉండేది. బతుకమ్మ సీజన్ వచ్చిందంటే చాలు.. కవితక్కే కనిపించేది. ఏ వేడుకలో అయినా ఆమె హైలెట్ గా మారేవారు. అలాంటి ఆమె.. తాజా సీజన్ లో మాత్రం అందుకు భిన్నంగా ఎక్కడా ఆమె కనిపించకుండా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
రెండు రోజుల క్రితం ఒక వీడియోను విడుదల చేశారు మంత్రి కేటీఆర్. అందులో బతుకమ్మ పండకు గుర్తింపు తేవటంలో తన సోదరి కవిత చేసిన కృషిని ఆయన తెగ గొప్పలు చెప్పేసుకున్నారు. కేటీఆర్ వీడియో ముందు వరకూ ఈసారి బతుకమ్మకు సంబంధించిన ఏ ప్రోగ్రాంకు ఆమె హాజరుకాలేదు.
ఇదిలా ఉండగా.. బతుకమ్మ విషయంలో కవిత కమిట్ మెంట్ గురించి తెగ పొగిడేసిన మంత్రి కేటీఆర్ వీడియో విడుదలయ్యాక.. ఆమె బయటకు వస్తారన్న అంచనాను వ్యక్తం చేశారు. అయితే.. వాటిని ఫెయిల్ చేస్తూ.. కవిత బయటకు రావటం లేదు.
సాధారణంగా బతుకమ్మ సంబరాల్ని కవితకు చెందిన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నారు. మామూలుగా అయితే.. వీటన్నింటిలోనూ కవితక్క కవర్ అయ్యేవారు. మీడియాలో ఫోకస్ అయ్యేవారు. కానీ..నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి చాలా కార్యక్రమాలకు కవిత దూరంగా ఉంటున్నారు.
ఇటీవల తన ఇంటి ఎదుట ముగ్గురు మహిళలు కలిసి బతుకమ్మ ఆట ఆడిన వైనాన్ని వీడియో తీసిన కవిత.. వాటిని షేర్ చేశారు. ఒకప్పుడు అంతా తానైనట్లుగా ముందుండి నడిపిన కవిత.. ఈసారి ఆమె జాడ లేకుండా పోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్ వీడియో షేర్ చేసిన తర్వాత.. ఆమె తెలంగాణ భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకలకు హాజరవుతారని భావించినా.. ఆమె మాత్రం రాలేదు. ఎన్నికల్లో ఓటమి ఏమో కానీ.. ఈసారి బతుకమ్మ వేడుకల్లో కవిత లేని లోటు మాత్రం కొట్టొచ్చినట్లుగా కనిపించిందని చెప్పక తప్పదు.