Begin typing your search above and press return to search.

తొమ్మిది రోజులూ ఆమె.. ఎవరినీ తిట్టరంట

By:  Tupaki Desk   |   14 Oct 2015 5:52 AM GMT
తొమ్మిది రోజులూ ఆమె.. ఎవరినీ తిట్టరంట
X
వినటానికి విచిత్రంగా ఉండే మాటల్ని రాజకీయనాయకులు తరచూ చెబుతుంటారు. ఇది.. అది సంబంధం లేకుండా తిట్టేసుకునే నేతలు ఇవాళ.. రేపటి రోజున బాగానే కనిపిస్తారు. అయితే.. తిట్టి పోసేందుకు.. విమర్శలు చేసేందుకు.. ఆరోపణలు సంధించేందుకు కొన్ని మినహాయింపులు ఉండాలన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కవిత చెప్పటం కాస్త ఆసక్తిని కలిగించేదే.

ఎవరినైనా సరే.. టార్గెట్ చేస్తే.. మాటలతో చీల్చి చెండాడే కవితక్క.. బతుకమ్మ పండుగ నిర్వహించే తొమ్మిది రోజులు తాను ఎవరినీ విమర్శలు చేయనని పేర్కొన్నారు. పర్వదినాల సందర్భంగా తాను ఎవరినీ విమర్శించనని చెబుతున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా చేస్తున్న విమర్శలపై తాను మాట్లాడనని.. పవిత్రమైన రోజుల్లో పూజలు చేసుకోవటం మానేసి.. ఈ విమర్శలేందన్నట్లుగా ఆమె చెబుతున్నారు.

అంతేకాదు.. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలు సైతం తమ నిరసనల్ని పక్కన పడేసి.. తనతో బతుకమ్మ పండుగలో పాలు పంచుకోవాలని పిలుపునిస్తున్నారు. ఆశా కార్యకర్తల్ని నిరసనలు చేయొద్దని చెప్పే బదులు.. వారి డిమాండ్లను అధికారంలో ఉన్న కవితక్క.. ముఖ్యమంత్రి అయిన తన తండ్రికి చెప్పి సానుకూలంగా రియాక్ట్ అయ్యేలా చేస్తే.. అందరూ కవితక్కతో పాటు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకుంటారు కదా..? సమస్యల్ని పక్కన పెట్టేసి పండుగ చేసుకోమనటంలోని లాజిక్ కవితక్కకే తెలియాలి.