Begin typing your search above and press return to search.
నాన్న ప్రేమతో ఇస్తానంటే కవిత వద్దంటోదట..
By: Tupaki Desk | 12 Jan 2020 5:07 AM GMTనిజామాబాద్ ఎంపీగా ఓడిన తర్వాత తెలంగాణ రాజకీయ తెరపై సీఎం కేసీఆర్ కుమార్తె కవిత సరిగ్గా కనిపించడం లేదు. ఓటమి భారమో లేక నైరాశ్యమో కానీ ఆమె కనుమరుగై పోయారు.మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి ఆమె లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తున్నారు. అప్పుడప్పుడూ ఆమె బహిరంగంగా కనిపించినప్పటికీ మీడియాకు మాత్రం దూరంగా ఉంటున్నారు.
గడిచిన సారి ఎంపీగా గెలిచిన కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా.. ఇటు ప్రభుత్వ , ప్రైవేటు కార్యక్రమాల్లో పలు వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా వెలుగు వెలిగారు. అయితే ఓడిపోయాక మాత్రం తెలంగాణ జాగృతి కార్యక్రమాలకు కూడా కవిత దూరంగా జరగడం గమనార్హం.
అయితే కవిత ఓటమి తర్వాత లూప్ హోల్ లోకి వెళ్లిపోవడంతో మరో నాలుగున్నర సంవత్సరాలు రాజకీయంగా పనిలేకుండా కూర్చోవడం అనేది కవితను మరింత కృంగదీస్తుంది.. ఆమె రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇది మంచిది కాదని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఓవైపు కొడుకు కేటీఆర్ రాజకీయంగా ఎదుగుతున్నారు. కూతురు మాత్రం ఓటమితో దూరమవుతున్నారు. అందుకే సీఎం కేసీఆర్ కవితను రాజ్యసభకు పంపడానికి నామినేట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట..
అయితే రాజ్యసభకు వెళ్లడానికి కవిత అంత ఆసక్తి చూపించడం లేదన్నది టాక్. ప్రజల్లో గెలిచి వెళితేనే తనకు స్థారకత అని.. ఇలా నాన్న ఇచ్చి నామినేటెడ్ పోస్టు ద్వారా వెళ్లడం తనకు ఇష్టం ఉండదని ఆమె ఆలోచిస్తున్నట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. బ్యాక్ డోర్ నుంచి అందలం ఎక్కలేనని కవిత అన్నట్టు వార్తలొస్తున్నాయి.
రాజ్యసభ సీట్లు ఉత్సవవిగ్రహం లాంటిది. దానికంటే రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని కవిత భావిస్తోందట.. అందుకే రాజ్యసభ సీటు కంటే పార్టీ పదవే ముఖ్యమని కవిత భావిస్తోందట.. ఒకవేళ కేటీఆర్ సీఎం అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కవితకు ఇవ్వడానికి కేసీఆర్ యోచించే ఆలోచన ఉంది. ఏం జరుగుతుందనేది భవిష్యత్తు నిర్ణయించనుంది.