Begin typing your search above and press return to search.
కవితకు షాక్.. కేంద్రాన్ని ఆమె ప్రశ్నిస్తే.. ఆమెను జనాలు ఆడేసుకున్నారు
By: Tupaki Desk | 31 May 2022 5:08 AM GMTగతంలో బీజేపీ ప్రకటించిన 'ధరల విముక్త భారత్' ఎప్పుడు సాధ్యమవుతుందని, ప్రధాని మోడీ ప్రకటించిన 'అచ్ఛేదిన్' ఎప్పుడు తెస్తారని తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పాలన ఎనిమిదేళ్లు పూర్తయిన నేపథ్యం లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాని మోడీకి ఆమె 8 ప్రశ్నలు సంధించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు సమాన ప్రాధాన్యం, జీడీపీలో తిరోగమనం, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఇతర నిత్యావసరాల ధరల నియంత్రణలో కేంద్రం వైఫల్యాలను ప్రశ్నించారు.
పెంచిన ధరల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన రూ.7 వేల కోట్ల పెండింగ్ నిధుల విడుదల ఎప్పుడని ప్రశ్నిస్తూ, నేర నియంత్రణతో పాటు అన్ని రకాల వైఫల్యాలను కవిత లేవనెత్తారు. పీఎమ్ కేర్స్ నిధుల గురించి దేశ ప్రజలకు కేంద్రం వాస్తవ సమాచారం వెల్లడించాలని కవిత డిమాండ్ చేశారు.
తిరగబడిన తెలంగాణ!
అయితే.. కవిత చేసిన ఈ వరుస ట్వీట్లకు తెలంగాణ సమాజం నుంచి కూడా అంతేస్థాయిలో రీట్వీట్లు వచ్చాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు బాగానే ఉంది.. మరి.. మీరు రాష్ట్రంలో చేస్తోంది ఏంటి? అంటూ.. నెటిజన్లు నిప్పులు చెరిగారు.
+ మీ హయాంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ కనీసం 5శాతం కూడా పూర్తికాలేదు. రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు మీ దగ్గర డబ్బులులేవు. ఇప్పటికీ మీరు గత ప్రభుత్వాలనే నిందిస్తున్నారు. మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అని ఒకరు దుయ్యబట్టారు.
+ మరొకరు.. మీరు గతంలో నిజామాబాద్ రైతులకు ఇచ్చిన హామీలను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.
+ నిరుద్యోగంపై కవిత ప్రశ్నలకు.. ఓనెటిజన్ స్పందిస్తూ.. కేంద్రం క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇస్తోందని, యువతను పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని.. అన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ హామీ అయిన.. నిరుద్యోగ భృతి ఏదని ప్రశ్నించారు.
+ మరికొందరు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు.. పోడు భూములకు పట్టాలు ఏమాయె? నిరుద్యోగ యువతకు రుణాల మంజూరు ఏదీ? అంటూ.. ప్రశ్నలు సంధించారు.