Begin typing your search above and press return to search.

ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత

By:  Tupaki Desk   |   16 Sep 2022 12:57 PM GMT
ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ  కవిత
X
తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు కలకలం రేపాయి. ఏపీలోని అధికార వైసీపీకి చెందిన ఎంపీ ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు జరిగాయని.. అలాగే తెలంగాణలోని ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ ఇంటిపై దాడులు జరిగాయని ఈ మధ్యాహ్నం నుంచి మీడియాలో వార్తలు హోరెత్తాయి. నోటీసులు జారీ చేసినట్టు వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు.

తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనపై ఈడీ దాడులు చేయలేని.. ఈ వార్తలను ఖండిస్తున్నట్టు కవిత తెలిపారు. ఢిల్లీలో కూర్చొని మీడియాను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. నిజనిర్ధారణ తర్వాతే వార్తలు వేయాలని.. రాయాలంటూ కవిత సూచించారు. ఈ విషయాన్ని నిజం చూపించడానికి ఉపయోగించమని మీడియా సంస్థలకు హితవు పలికారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు.

అయితే ఈడీ శుక్రవారం కవితకు ఆడిటర్ గా నిర్వహించిన బుచ్చిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.. హైదరాబాద్ లోని దోమలగూడలోని అరవింద్ నగర్ శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలోని బుచ్చిబాబు నివాసంలో నలుగురు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. బుచ్చిబాబు గతంలో కవితకు అకౌంటెంట్ గా ఉన్నారు.

ఇక గచ్చిబౌలిలోని అభినవ్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరిగాయని అంటున్నారు. కవిత పీఏగా పనిచేస్తున్న అభిషేక్ రావు ఇంట్లో ఈడీ ఇప్పటికే సోదాలు చేసినట్టు సమాచారం.. నోటీసులు అందుకున్న వారిలో శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్ రావు, ప్రేమ్ సాగర్ రావు, అరున్ పిళ్లై ఇతరులు ఉన్నారు. ఇండో స్పిరిట్, అరబిందో ఫార్మా తదితరు సంస్థలు ఉన్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంను సీరియస్ గా తీసుకున్న కేంద్రప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోదాలు జరిపినట్టు తెలుస్తోంది.కానీ కవిత ఇంటిపై దాడి కానీ.. ఎలాంటి సోదాలు కానీ ఇంతవరకూ జరగలేదని ఆమె స్పష్టం చేశారు. ఈడీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈడీ దాడులపై మీడియా కథనాలపై స్పందించలేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.