Begin typing your search above and press return to search.
కవితక్కది ఎంత మంచి మనసో....
By: Tupaki Desk | 30 Aug 2015 11:22 AM GMTతెలంగాణ రాష్ర్ట సమితి ఎంపీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. తెలంగాణ రాష్ర్ట పార్టీగా ఎప్పుడూ ఆ రాష్ర్టం గురించే మాట్లాడే కవిత...తాజాగా ఏపీ గురించి ప్రస్తావించారు. అక్కడి పరిస్థితుల గురించి చలించిపోయి స్పందించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కవిత కోరారు. న్యాయమైన డిమాండ్ కోసం ప్రాణాలు కోల్పోవడం మంచిది కాదని, బ్రతికి ఉండి సాధించాలని ఆమె సూచించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మౌనం ఆంధ్రప్రదేశ్ కు శాపంగా మారిందని ఆమె మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం బాబు ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయట్లేదని ఆమె ఆరోపించారు. రాజకీయ అవసరాలు పక్కనపెట్టి ఏపీకి దక్కాల్సిన వాటి గురించి ప్రధానమంత్రి మోడీని చంద్రబాబు నిలదీయాలని కోరారు. ఏపీకి కావాలంటే చంద్రబాబు కేంద్రంను అడిగి ప్రాజెక్టులను కేటాయింపు చేయించుకోవచ్చని సూచించారు. కానీ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను అడ్డుకుంటే వాళ్లకు వచ్చే లాభమేమీలేదన్నారు.
తెలంగాణ రాష్ర్టానికి అన్యాయం చేయాలని బాబు కుట్రలు పన్నుతున్నారని, తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు చేస్తోన్న కుట్రలను కేంద్రానికి వివరించామని కవిత తెలిపారు. నోటితో నవ్వడం, నొసలుతో వెక్కిరించడం చంద్రబాబు నైజమన్నారు. పారదర్శకంగా చర్చలు జరిపేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు రావాలన్నారు. రెండు రాష్ర్టాలను సమానంగా చూడాలని కేంద్రాన్ని ఆమె కోరారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు