Begin typing your search above and press return to search.
నాకు టెన్షన్‌లేదు.. మోడీ టార్గెట్ నేను కాదు: కవిత కామెంట్స్
By: Tupaki Desk | 28 Aug 2022 2:30 AM GMTతాజాగా వెలుగు చూసిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని.. ఆమె కనుసన్నల్లోనే డీల్ కుదిరిందని .. బీజేపీ నాయకులు ఢిల్లీలో ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే.. ఇలా ఆరోపించిన బీజేపీ నేతలపై.. కవిత పరువు నష్టం దావా వేశారు.
అయితే.. తాజాగా.. ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు ఈ లిక్కర్ కుంభకోణానికి అసలు సంబంధమే లేదని చెప్పారు. లేనిపోని విమర్శల కారణంగా వస్తున్న వార్తలను తాను పట్టించుకోనని చెప్పారు.
అదేసమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టార్గెట్‌లో తాను లేనేలేనని.. కవిత చెప్పారు. తన తండ్రి కేసీఆర్ మాత్రమే మోడీ టార్గెట్‌లో ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. ``మోడీ టార్గెట్ నేను కాదు. ఆయన టార్గెట్ అంతా కూడా సీఎం కేసీఆర్. నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ లేని తెలంగాణ లేదు. ఢిల్లీలో ఏం జరిగిందో నాకు స్పష్టమైన సమాచారం ఉంది’’ అని కవిత ప్రకటించారు. తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని తప్పుబట్టారు.
ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అయిందో లేదో తెలియదని ఆమె తోచిపుచ్చారు. ఆధారాలు లేని ఆరోపణలకు ఊతం ఇవ్వరాదన్నారు. కోర్టు చెప్పిన తరువాత కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీని జేబు సంస్థగా వాడుకుంటున్నారని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని, తెలంగాణలోనూ బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని కవిత దుయ్యబట్టారు. కేసీఆర్ అంటే బీజేపీ సర్కార్‌కు భయమని, అందుకే ఆయన పక్కన ఉండేవారిని ఇబ్బంది పెడుతున్నారని కవిత విమర్శించారు . ప్రైవేటు సంభాషణలను వక్రీకరించి రాస్తున్న వార్తలు.. చేస్తున్న ప్రచారానికి తాను ఎట్టిపరిస్థితిలోనూ భయపడేది లేదని కవిత పేర్కొన్నారు.