Begin typing your search above and press return to search.

తండ్రి కేసీఆర్ వద్దకు కవిత.. కారణమిదే?

By:  Tupaki Desk   |   25 Feb 2021 1:50 PM GMT
తండ్రి కేసీఆర్ వద్దకు కవిత.. కారణమిదే?
X
టిఆర్‌ఎస్‌ నాయకురాలు, నిజామాబాద్‌ ఎంఎల్‌సి కవిత తన తండ్రి, సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయబోతున్నారు. కవితతోపాటు తెలంగాణ శాసనమండలి సభ్యుల ప్రతినిధి బృందంతో కలిసి ఆమె సీఎం కేసీఆర్‌ను కలవబోతున్నారు. అంతకుముందు కవిత పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలుసుకుని స్థానిక సంస్థలకు నిధులు కోరారు. ఈ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి దీనిపై విన్నవించనున్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. "స్థానికంగా ఎన్నికైన ప్రతినిధులకు స్థానిక సంస్థల్లో తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు అందువల్ల వారు ఉత్సవ విగ్రహంగా ఉన్నారు. ఎంఎల్‌సీలు ఈ రోజు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సమస్యలపై నివేదికను సమర్పించారు. ఈ సమస్యలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వద్దకు కూడా తీసుకువెళతారు ”అని కవిత సమావేశం అనంతరం చెప్పారు.

ఈ సందర్భంగా స్తానిక సంస్థల సమస్యలపై కేసీఆర్ ను కోరుతామని కవిత చెప్పుకొచ్చారు. "నిధుల వికేంద్రీకరణ జరిగితే గ్రామాలు బాగుపడుతాయి. నిధులు స్థానిక సంస్థలకు చేరుకున్నప్పుడు రాష్ట్రంలో మరింత అభివృద్ధిని జరుగుతుంది' అని కవిత అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి నిధులు సర్పంచ్‌లకు ఇవ్వబడుతున్నాయి. అయితే జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలకు వీటిలో ప్రాధాన్యం ఇస్తే గ్రామ స్థాయిలో మరింత అభివృద్ధి జరుగుతుంది "అని కవిత అన్నారు.ఎమ్మెల్సీలకు కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని.. గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశం ఇవ్వాలని కవిత తన తండ్రి, సీఎం కేసీఆర్ ను కోరేందుకు డిసైడ్ అయ్యారు.