Begin typing your search above and press return to search.
కవిత కేంద్ర మంత్రి కలలు ఖతమ్..
By: Tupaki Desk | 23 May 2015 1:41 PM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కేంద్రంలో మంత్రి పదవి చేజిక్కుంచుకోవాలని చాలాకాలంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే... ఆమె కలలు తీరే దారే కనిపించడంలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అందుకు ఏమాత్రం సానుకూలంగా లేకపోవడమే దీనికి కారణం.
నిజానికి కవిత కేంద్రంలో చేరడానికి కేసీఆర్ నుంచి బీజేపీకి సంకేతాలు వెళ్లాయి... అయితే, బిజెపి నుంచి మాత్రం వ్యతిరేకతే వచ్చింది. ప్రధాని మోడీ ఆహ్వానిస్తే కేంద్రంలో చేరే విషయం ఆలోచిస్తామని నిజామాబాద్ ఎంపీ అయిన కవిత పలుమార్లు మనసులోని మాటను బయటపెట్టుకున్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సందర్బాల్లోనూ అక్కడా ఇక్కడా కుమార్తె పదవికోసం ప్రస్తావించారు. కానీ బీజేపీ వర్గాలు మాత్రం దీనికి ఏమాత్రం రెస్పాండవడం లేదు. బీజేపీ నాయకులు మురళీధరరావు అయితే ఇటీవల... తాము తెలంగాణలో సొంతంగా ఎదగాలని అనుకుంటున్నామని, తాము టిఆర్‌ఎస్ ను ప్రత్యర్ధిగానే పరిగణిస్తామని అన్నారు. బీజేపీకి సొంతంగా కేంద్రంలో మెజార్టీ రావడంతో ప్రాంతీయ పార్టీల అవసరం లేకుండా పోయింది. దీంతో టీఆరెస్ కోరి వస్తానంటున్నా వద్దంటోంది. పైగా కవిత గతంలో బీజేపీ, ఆరెస్సెస్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆరెస్సెస్ వర్గాలు ఆమెను తీసుకోవడానికి ససేమిరా అంటున్నాయి. ఈ లెక్కన టీఆరెస్, బీజేపీలు దగ్గరయినా సరే వేరే ఇంకెవరైనా మంత్రి కావొచ్చు కానీ కవితకు మాత్రం ఛాన్సు లేనట్లే. ఆరెస్సెస్ వద్దన్న పని మోడీ ఎంతమాత్రం చేసే అవకాశం లేదు కాబట్టి కవిత కేంద్ర మంత్రి ఆశలు ఖతమైనట్లే.