Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే కావాలని కవితక్క తహతహ!
By: Tupaki Desk | 8 July 2017 3:38 PM GMTతెలంగాణ రాష్ట్రంలో అధికారపక్షానికి తిరుగులేదన్న విషయం తెలిసిందే. అధికారపక్ష అధినేత కేసీఆర్ కారణంగా ఆ పార్టీకి తిరుగులేని అధిపత్యం ఇప్పుడైతే ఉంది. సమీప భవిష్యత్తులో కేసీఆర్ ను కొట్టే మొనగాడు మరెవరూ తెర మీదకు రాలేరన్న ధీమా మాటల్ని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. చాప కింద నీరులా తెలంగాణ అధికారపక్షంలో అధిపత్య పోరు అంతకంతకూ పాకుతుందన్న వాదన వినిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ ఎస్ పార్టీ పెట్టిన వేళలో.. మేనమామ కేసీఆర్ కు అండగా నిలిచారు హరీశ్ రావు. ఉద్యమంలోకి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా హరీశ్ హవానే సాగింది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అప్పటి నుంచి హరీశ్ స్థానే కేటీఆర్ హవా అంతకంతకూ పెరగుతోంది.
ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కు తిరుగులేకుండా పోయింది. అన్ని విధాలుగా హరీశ్ తో పోలిస్తే.. కేటీఆరే బెస్ట్ ఆప్షన్ అన్నట్లుగా పరిస్థితి మారింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆసక్తికర రాజకీయ చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. టీఆర్ ఎస్ లో కేసీఆర్ తర్వాత ఎవరన్న రేసులోకి కేటీఆర్ కు తోడుగా.. ఆమె సోదరి కవితక్క కూడా వచ్చేసినట్లుగా చెబుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా.. ఎంపీగా పోటీ చేసిన ఆమె.. బంపర్ మెజార్టీతో గెలిచి లోక్ సభలో అడుగు పెట్టారు. అప్పటి నుంచి అవకాశం వచ్చిన ప్రతిసారీ తన మార్క్ ను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తన తండ్రి తర్వాత తానే పార్టీకి వారసురాలిగా మారాలన్నది కవిత ఆలోచనగా చెబుతున్నారు. మొన్నటి వరకూ పార్టీలో కేటీఆర్ కు తిరుగులేదన్న వాదన వినిపిస్తున్న వేళ.. కవితక్క ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆమె.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా బరిలోకి దిగటం ఖాయమని చెబుతున్నారు. ఎమ్మెల్యేగా విజయంసాధించిన తర్వాత.. రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేలా.. రాష్ట్రప్రజలతో మమేకం అయ్యేందుకు వీలుగా ఎమ్మెల్యే కావాలని ఆమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎమ్మెల్యే అయితే.. రాష్ట్ర రాజకీయాల్లోకి నేరుగా ఇన్ వాల్వ్ కావొచ్చన్న ఆలోచనలో కవితక్క ఉన్నట్లుగా చెబుతున్నారు. తన ప్లాన్ అమల్లో భాగంగా.. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలన్నది ఆమె ఆలోచనగా చెబుతున్నారు. అదే జరిగితే మాత్రం తెలంగాణ అధికారపక్షంలో సరికొత్త వారసత్వ పోరు షురూ కావటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. ఇలాంటి పోరు మీద అధినేత కేసీఆర్ రియాక్షన్ ఏమిటన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.