Begin typing your search above and press return to search.
కావూరి మాట: లడ్డూలు మంచివే కానీ...
By: Tupaki Desk | 14 Sep 2016 9:24 AM GMTఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో నమ్మకద్రోహం అనంతరం కాకినాడలో సభపెట్టిన పవన్ కల్యాణ్.. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకూ ప్యాకేజీని సమర్ధించేవారు, వ్యతిరేకించేవారు కూడా ఈ లడ్డూలమీదుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ విషయాలపై తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి, నేటి భారతీయ జనతాపార్టీ నేత కావూరి సాంబశివరావు లడ్డూలపై స్పందించారు.
కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పవన్ పోల్చడం లో అర్ధం ఇప్పుడు అంతా అనుకుంటున్నది కాదని, దాని పరమార్ధం వేరే అని చెప్పుకొచ్చారు కావూరి సాంబశివరావు. కేంద్రం ఇచ్చిన లడ్డూలు మంచివేనని, కాకపోతే పాచిపోక ముందు ఇచ్చిఉంటే బాగుండేదనేది పవన్ కల్యాణ్ అభిప్రాయమని భావానువాదం చేశారు కావూరి సాంబశివరావు అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రాభివృద్ధి కోసమే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని, ఈ ప్యాకేజీ + వెంకయ్య నాయుడిది ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర అని కావూరి కొనియాడారు. ఇదే సాయంలో ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు అంటే తనకు మరింత గౌరవం పెరిగిందనని కావూరి అనర్గలంగా అభినందించారు.
ఇక తమ మాజీ అధినేత్రి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు "సోనియమ్మ"పై కావూరి సాంబశివరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే దురుద్దేశంతోనే తెలుగు వారికి అన్యాయం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటే అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని తాను అప్పట్లో కోరామని, నాడు మా మాట వినకపోవడమే నేటి కాంగ్రెస్ దుస్థితికి కారణమని కావూరి పేర్కొన్నారు.