Begin typing your search above and press return to search.
మోడీ అహంకారాన్ని వీడకపోతే...
By: Tupaki Desk | 14 Nov 2017 7:26 AM GMTబీజేపీ సర్వం తానే అయిపోయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆ పార్టీకే చెందిన నాయకులు - కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాజకీయాలు - కేంద్ర రాష్ట్ర పరిణామాల గురించి మాట్లాడుతూ ప్రధాని మోడీ పరిణామాన్ని తెరమీదకు తెచ్చిన కావూరి ఈ క్రమంలో కలకలం రేకెత్తించే కామెంట్లు చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ మాటల అహంకారాన్ని వీడితే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ విషయంలో కొన్ని మిత్రపక్షాలు చేస్తున్న కామెంట్లు గమనించాలని కోరారు.
దేశ ప్రధాని మోడీ పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వాటి ఫలితాలు ప్రజలు అనుభవిస్తున్నారని కావూరి తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తాను పని చేసిన క్యాబినెట్ లో ఎకె.ఆంటోని ఒక్కరే నీతిపరుడని మిగతా వారంతా అవినీతిలో కూరుకుపోయారన్నారు. నేడు మోడీ పాలనలో కేంద్ర మంత్రులు ఎటువంటి అవినీతికి పాల్పడకుండా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. అయితే ప్రధాని మోడీ తన మాట తీరును మార్చుకుంటే మరింత మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని మాజీ కేంద్ర మంత్రి అయిన కావూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు - ఎంపిలు సంపాదనే ధ్యేయంగా పని చేయటం మానేసి ప్రజా సేవకు అంకితం కావాలని కోరారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్ ప్రజలకు ఏమి చేస్తాడో చెప్పకుండా తాను ముఖ్యమంత్రి అవ్వటం కోసం ప్రార్ధనలు చేయమనటం విడ్డూరంగా ఉందని కావూరి ఎద్దేవా చేశారు. తెలుగుదేశం మిత్రపక్షమైన బీజేపీని కలుపుకోకుండా నియంతలా వ్యవహరిస్తోందని కావూరి అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ తప్పు చేస్తే బీజేపీ శ్రేణులు వాటిని నిర్మోహ మాటంగా ఖండించాలన్నారు. ప్రజా సమస్యల విషయంలో, అవినీతి వంటి వాటిలో చూసీ చూడనట్లు వ్యవహరించాల్సిన అవసరం లేదని కావూరి స్పష్టం చేశారు.