Begin typing your search above and press return to search.
బీజేపీలోని కాంగ్రెస్ నేతల ''డబుల్'' గేమ్
By: Tupaki Desk | 8 April 2015 9:14 AM GMTబీజేపీ నాయకులు పట్టిసీమ ప్రాజెక్టుపై డబుల్ గేమ్ ఆడుతున్నారు. రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూనే టీడీపీకి ఇబ్బందులు తెచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గతంలో కేంద్రంలో కాంగ్రెస్ నుంచి మంత్రులు పనిచేసి బీజేపీలో చేరిన ఇద్దరు నేతల తీరు చంద్రబాబుకు ఇబ్బందులు తెస్తోంది.
రాయలసీమలో కరవు పరిస్థితులపై అధ్యయనం అంటూ బీజేపీ నేత పురంధేశ్వరి రాష్ట్రంలోని బీజేపీ మంత్రులను వెంటేసుకుని రాయలసీమలో పర్యటించి... ఒక నివేదిక రూపొందించి.. ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఇవ్వగా... కేంద్రం నుంచి బృందం వచ్చి ఇక్కడ పర్యటిస్తుంటే... ఆమె మాత్రం మాట మారుస్తున్నారు. ఇంతవరకు రాయలసీమ కరవు అంటూ కన్నీరొలిలికించిన ఆమె ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన మరో మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కూడా ఆ పాటే పాడుతున్నారు. హంద్రీనీవా, గాలేరు నగరి వంటి వృథా ప్రాజెక్టులు కాకుండా గోదావరి వృథా నీటిని కృష్టకు తరలించిన కృష్ణానది నుంచి రాయలసీమకు నీరిచ్చే ప్లాన్ తో తలపెట్టిన పట్టిసీమతో రాయలసీమకు ఎంతైనా ప్రయోజనకరమే. అది విజయవంతంగా పూర్తయితే చంద్రబాబును రాయలసీమలో కొట్టేవాడే ఉండడు. ఆ సంగతి తెలిసే పట్టిసీమను అడ్డుకునేందుకు రకరకాల విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్, వైసీపీ నేతలు. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ నేతలూ వారికి జత కలవడమే ఆశ్చర్యకరం.
ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉంటూనే ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతను ఇరుకునపెట్టేలా డబుల్ గేమ్ ఆడుతున్నారు ఈ బీజేపీ నేతలు. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ లోనే ఉండి గతిలేని పరిస్థితుల్లో బీజేపీలోకి వచ్చిన వీరికి ఇంకా కాంగ్రెస్ బుద్ధులు పోనట్లుంది.