Begin typing your search above and press return to search.
గ్రేటర్ బస్తీల్లో రూ.300లకే ఆ రెండు?
By: Tupaki Desk | 15 Oct 2015 5:38 AM GMTజనవరి తర్వాత జరిగే అవకాశం ఉన్న గ్రేటర్ ఎన్నికలకు తెలంగాణ అధికారపక్షం సిద్ధమవుతోంది. తెలంగాణ సాధన తర్వాత తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో విజయం సాధించిన టీఆర్ఎస్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగరాలని తహతహలాడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు రకాలుగా కసరత్తు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
కేసీఆర్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రేటర్ పరిధిలోని 1.25 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్థి చేకూరటమే కాదు.. కేసీఆర్ సర్కారు తమకిచ్చిన తోఫాను నేరుగా ఎంజాయ్ చేసే వీలుందని చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరెంటు బిల్లు..నల్లా బిల్లు గూబ గుయ్యిమనే పరిస్థితి. మహానగరంలోని మురికివాడల్లో నివసించే ప్రజల వరకూ చూస్తే ఈ రెండు బిల్లులు కాస్త భారం కలిగించేవే. అందుకే.. ఈ రెండు బిల్లుల మీద కేసీఆర్ సర్కారు ఫోకస్ చేస్తోంది. గ్రేటర్ పరిధిలోని బస్తీల్లోని కుటుంబాలకు అద్భుతమైన ఆఫర్ ను కేసీఆర్ సర్కారు అందించాలని భావిస్తోంది.
నెలకు కేవలం రూ.300 కడితే చాలు.. నల్లా బిల్లుతో పాటు.. కరెంటు బిల్లు కూడా కట్టేలా ప్యాకేజీ ఒకటి ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.ఈ పథకం కాని అమలు జరిగితే.. దాదాపుగా ప్రతి కుటుంబం మీదా నెలకు కనిష్ఠంగా రూ.150 నుంచి గరిష్ఠంగా రూ.350 మధ్యలో లబ్థి పొందే వీలుంటుందని చెబుతున్నారు. అదే జరిగితే.. గ్రేటర్ పరిధిలోని అడ్డాల్లోని 1.25 లక్షల కుటుంబాలు తమ సర్కారుకు విధేయతగా ఉండే వీలుందన్న భావనను తెలంగాణ అధికారపక్షం వ్యక్తం చేస్తోంది. మరి.. ఇదెంత వర్క్ వుట్ అవుతుందో తెలియాలంటే.. ఈ పథకాన్ని అమలు చేసి.. గ్రేటర్ ఎన్నికలకు వెళితే మాత్రమే తెలుస్తుందని చెప్పక తప్పదు.