Begin typing your search above and press return to search.
రాజధాని కోసం ఒక్కరోజే 8000 కోట్లు
By: Tupaki Desk | 6 Jan 2016 6:48 AM GMTగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాజకీయాల్లో అసలు మజాను రుచి చూపిస్తున్నాయి. బల్దియా పోరులో విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అధికార టీఆర్ ఎస్ పార్టీ రెండు రకాల వ్యూహాలతో ముందుకు వెళుతోంది. ఒకవైపు పార్టీపరంగా నాయకులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఉంటే మరోవైపు ప్రభుత్వ పరంగా వరాలు కురిపిస్తున్నారు. హామీల అమలుకు అవసరం అయిన జీవోలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వపరంగా ప్రజలను ఆకట్టుకోవడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న అధికార పార్టీ ఒకేరోజు వేలకోట్ల రూపాయలను కేటాయిస్తు ఉత్తర్వులు విడుదల చేయడం గమనార్హం.
ఒకటి రెండు రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఉండే రాజ్యాంగపరమైన చిక్కులను ఎదుర్కునేందుకు గాను...వరాల అమలుకు జీవోలు విడుదల చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్తర్వులు ఒకే రోజు జారీ అయ్యాయి. ఇంటి పన్ను మాఫీ - నగరంలో రియల్ ఎస్టేట్ కు అభివృద్ధి - భవనాల నిర్మాణానికి అనుమతుల్లో రాయితీల వంటి పలు అంశాలపై జీవోలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ దాహాన్ని తీర్చే కీలక ప్రాజెక్టుల కోసం 7600 కోట్ల రూపాయల వ్యయంతో నగరంలో రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగరానికి ప్రధానంగా నీటి సమస్యను తీర్చే ఉస్మాన్ సాగర్ - హిమాయత్ సాగర్ - మంజీరాలపై ఎక్కువగా ఆధారపడలేని పరిస్థితి ఏర్పడడంతో ఇతర మార్గాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. శామీర్ పేట మండలంలో 20 టిఎంసిల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తారు. అదే విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద మరో రిజర్వాయర్ నిర్మిస్తారు.
మరోవైపు 1200 రూపాయల వరకు ఉన్న ఇంటి పన్నును 101 రూపాయలకు పరిమితం చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఉత్తర్వులు జారీ చేశారు. అపార్ట్ మెంట్స్ - ఇళ్లకు పన్నెండు వందల రూపాయల వరకు పన్ను చెల్లిస్తున్న వారు ఇకపై 101 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఆదేశాల వల్ల రూ.70 కోట్ల వరకు భారం పడుతుందని సమాచారం. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 151 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ కు ఊతం ఇచ్చేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు కమిటీ వేశారు. ఇందులో పెద్ద ఎత్తున మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది.
మొత్తంగా ఎన్నికల పుణ్యామా అని గ్రేటర్ ఒకేరోజు వేల కోట్లు కేటాయిస్తు ఉత్తర్వులు విడుదల అవుతూ వరాల జల్లు కురుస్తోందని గ్రేటర్ ప్రజలు ఖుషీ అవుతున్నారు.