Begin typing your search above and press return to search.
గెలుపు గురి.. కేసీఆర్ ఏ - బీ - సీ ఫార్ములా
By: Tupaki Desk | 20 Nov 2018 5:18 AM GMTకేసీఆర్ మాస్టార్ ప్లాన్ వేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచార శైలిలో వినూత్న పంథాను అవలంభిస్తున్నారు. తెలంగాణలోని ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులను సర్వేలతో ఆవపోసన పట్టిన కేసీఆర్ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఎన్ని.? ప్రచారం బాగా చేస్తే గెలిచే అవకాశాలున్న సీట్లు ఏవీ.. టీఆర్ ఎస్ గెలవని సీట్లు ఏవీ అనేవి దాదాపు నిర్ధారణ చేసుకున్నారట.. అందుకే తాజాగా మలివిడత ప్రచారంలో కేసీఆర్ ఆ నియోజకవర్గాల్లోనే ప్రచార సభలను ఏర్పాటు చేసుకోవడం విశేషం.
కేసీఆర్ ప్రచారంలో ఏ - బీ - సీ ఫార్ములాను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏ కేటగిరిలో తెలంగాణలోని మంత్రులు - టీఆర్ ఎస్ ప్రముఖుల సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్న ప్రచారం ఈ సీట్లలోనే సాగుతోంది. మంత్రి తుమ్మల సారథ్యంలో నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించారు. అనంతరం ఖచ్చితంగా గెలిచి మంత్రి అవుతాడని భావిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గం పాలకుర్తిలో ప్రసంగించారు. ఈరోజు టీఆర్ ఎస్ కు ఎంతో బలమున్న మంత్రులు కేటీఆర్ - ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల - హుజూరాబాద్ లో సభలు పెట్టారు. ఆ తర్వాత పోయిన సారి క్లీన్ స్వీప్ టీఆర్ ఎస్ కు అందించిన నిజామాబాద్ జిల్లాల్లో కేసీఆర్ సభలు పెట్టారు..
దీన్ని బట్టి గెలిచే సీట్లలోనే కేసీఆర్ తొలుత ప్రచారం మొదలుపెట్టారని అర్థమవుతోంది. కేసీఆర్ స్కెచ్ ప్రకారం మొత్తం 119 నియోజకవర్గాలను ఏ - బీ - సీ గ్రేడులుగా విభజించారు.ఇందులో ఏ గ్రేడ్ లో సిద్దిపేట - సిరిసిల్ల - ఖమ్మం - పాలేరు - ఎల్లారెడ్డి - జడ్చర్ల - మెదక్ - ఖానాపూర్ - బోథ్ - నిర్మల్ - ముథోల్ - దేవరకొండ - నకిరేకల్ - ఆర్మూర్ - నర్సంపేట - మహబూబాబాద్ - డోర్నకల్ - సూర్యపేట - తుంగతుర్తి - జనగామ - తాండూర్ - పరిగి - నారాయణ పేట - దేవరకద్ర - షాద్ నగర్ - ఇబ్రహీంపట్నం ఉన్నాయి. ఇవే టీఆర్ ఎస్ ఖచ్చితంగా గెలిచే 26 సీట్లు అట.... అందుకే ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లోనే కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు..
ఇక కొద్దిగా కష్టపడితే గెలిచే సీట్లలో కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రచారం నిర్వహించాలని ప్లాన్ చేశారట.. అవి తెలంగాణలో 35 నుంచి 45 సీట్లు ఉన్నాయి. ఎన్నికల ముందు ఎలాగైనా ఈ సీట్లలో ప్రచారం చేస్తే అక్కడ సీన్ మార్చే దమ్ము కేసీఆర్ కు ఉంటుంది. అందుకే వాటిల్లో డిసెంబర్ 7కు ముందు ప్రచారం చేసేందుకు నిర్ణయించారు. వీటిని టీఆర్ ఎస్ బీ కేటగిరి సీట్లుగా పెట్టుకుంది. ఇక సీ కేటగిరిలో కాంగ్రెస్ కీలక నేతలు - ఎమ్మెల్యేల సీట్లను చేర్చారు. ఇక్కడ సమయం లేకపోతే ప్రచారం చేయనవసరం లేదని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో ఉత్తమ్ - రేవంత్ - జానారెడ్డి - కోమటిరెడ్డి బ్రదర్స్ - దామోదర - భట్టి - జీవన్ రెడ్డి - తదితరుల కాంగ్రెస్ పెద్దల నియోజకవర్గాలున్నాయి. ఇలా కేసీఆర్ టీఆర్ ఎస్ ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావడానికి వేసిన ఏ - బీ - సీ కేటగిరిల ప్రచార ప్లాన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరి..