Begin typing your search above and press return to search.
పంచాయతీ అంతా ఏపీతోనే...ఎలా బీయారెస్ బాస్...?
By: Tupaki Desk | 5 Oct 2022 9:30 AM GMTకేసీయార్ లో జాతీయ నాయకుడు ఈ విజయదశమికి బయటకు వచ్చారు. అంటే ఆయనకు భారతదేశం తప్ప మరేమీ కళ్ల ముందుకు రావు, నిజంగా జాతీయ భావాలు ఉంటే రాకూడదు, సర్దుకుని పోవాలి కూడా. కానీ కేసీయార్ ఆ రకం కాదే. మా నీళ్ళు, మా నియామకాలు, మా నిధులు అంటూ తెలంగాణా ఉద్యమాన్ని తీసుకువచ్చి ఆకాశాన్ని భూమిని కలిపిన ఉద్ధండుడే.
అలాంటి కేసీయార్ పుణ్యమే కదా ఇపుడు విభజన ఏపీ గాయాల పాలు అయి నిలువుగా ఇబ్బందులు పడుతోంది. ఇపుడు భారత రాష్ట్ర సమితి అధినేత హోదాలో ఏపీకి వెళ్తే ఆయన ఇచ్చే హామీలు ఏంటి, ఏపీ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు.
ఇవన్నీ కీలకమైన ప్రశ్నలే. ఏపీ తెలంగాణాల మధ్య ఎనిమిదేళ్ళు అయినా తెగని పంచాయతీ ఉందిగా. ముఖ్యంగా నీళ్ళ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య భగ్గుమనే వివాదాలు ఉన్నాయిగా. విభజన అంశాలు ఒక పట్టాన తేలనివే కదా. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనుకుని ఏపీలోని ప్రజలు అంతా కష్టం ఓడ్చి పెట్టి కూర్చిన ఆస్తుల వివాదం ఈ రోజుకీ తెమలలేదే.
వాటిని ఎంచక్కా తమ సొంత ఆస్తుల మాదిరిగా తెలంగాణా వాడుకుంటూ ఏపీని ఇబ్బంది పెడుతోందే. ఈ ఆస్తుల విలువ కూడితే వేల కోట్ల దాకా ఉంటాయని అంటున్నారు. అలాగే రీసెంట్ గా తెలంగాణాకు ఏపీ ఇచ్చిన విద్యుత్ దాని ఖర్చు, మీద వడ్డీ కలిపి ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లిచాల్సి ఉండగా హై కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుని ఏపీ నోట్లో మట్టి కొట్టారుగా అని అంటున్నారు.
అదే విధంగా చూస్తే పోలవరం ప్రాజెక్ట్ కి కొర్రీలు పెడుతూ అడ్డుకుంటున్నది తెలంగాణా అని అందరికీ తెలిసిందే. దాని మీద ఏపీ జనాలు గుస్సా మీద ఉన్నారుగా. ఇక రాయలసీంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణా ఎపుడూ గుడ్లురుముతూనే ఉందిగా. ఆ ప్రాజెక్ట్ అక్రమం అని అంటోంది కదా. ఇపుడు దాని విషయం చెప్పమంటే కేసీయార్ బీయారెస్ అధినేతగా ఏమి మాట్లాడతారు.
అలాగే శ్రీశైలంలో నీటి వాటా ఇంకా తేలడంలేదు. మరి ఏపీ ఓట్ల కోసం వచ్చే కేసీయార్ దాని గురించి ఎలా తన నాలికను తిప్పుతారు అన్నది కూడా ఆసక్తికరమే కదా. అలాగే శ్రీశైలం నుంచి విద్యుత్ ఉప్తత్తి వద్దు అంటూనా తెలంగాణా చేసుకుంటూ పోతోంది. దాని మీద కూదా బీయారెస్ మాట్లాడాలి కదా. పోలవరం విలీన మండలాల విషయనంలో కూడా టీయారెస్ వాయిస్ వేరు, బీయారెస్ వాయిస్ వేరుగా ఉంటాయా. అలా కాక పోతే ఏపీలో వర్కౌట్ అవుతుందా.
తరచూ ఏపీ మీద టీయారెస్ నేతలు దూకుడుగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి బీయారెస్ పెట్టిన కేసీయార్ కి ఏపీ ఓట్లు కావాలంటే ఆయన ఏం చెబుతారు. ఏపీ జనాలను ఎలా ఒప్పిస్తారు. అసలు ఏపీతో పంచాయతీ ముందు తెగితేనే కదా కేసీయార్ కి ఇక్కడ ఓట్లు రాలేదీ అన్నదే చర్చగా ఉంది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.