Begin typing your search above and press return to search.
బండి సంజయ్ పరువు గంగపాలు చేసిన కేసీఆర్
By: Tupaki Desk | 14 Feb 2022 2:30 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ పై విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. ప్రగతి భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరును కూడా ఆయన తప్పుబట్టారు.
బండి సంజయ్ కారణంగా రోజురోజుకీ ఆ పార్టీ పరువు పోతుందని అన్నారు. సంజయ్ కి చదువు వస్తుందో రాదో అంటూ సీఎం కేసీఆర్ సెటైర్ వేశారు. పాపం ఆయన్ను చూస్తే జాలేస్తోందని.. ఆయనకు బదులు వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్ అని ఎద్దేవా చేశారు.
ఎఫ్ఆర్బీఎం పవర్ రీఫామ్స్ ను తెలంగాణ తరఫున వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. ఈ విషయంలో రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్ చేసి పంపి.. వ్యతిరేకిస్తూ రాసిన లేఖలు ఉండగా బండి సంజయ్ పచ్చి అబద్దం చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా సంజయ్ పై కేసీఆర్ సెటైర్లు వేశారు.
``పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చదువు వస్తదో రాదు నాకు తెల్వదు. చదివిన కాగితం అర్థమైతదో కాదో. ఆయనను చూస్తే జాలేస్తుంది.. ఆయన మాట్లాడకుండా వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్ నన్నడిగితే. ఆ పార్టీ పరువు పోతుంది రోజు రోజుకు.`` అంటూ బీజేపీ తెలంగాణ నాయకుడిపై సెటైర్లు వేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పేది ఒకటి.. చేసేది ఒక్కటని కేసీఆర్ ఆరోపించారు. మోడీ అబద్ధాలు చెబుతున్నారని.. అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెచ్చారని విమర్శించారు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో రైతులు బాగుపడుతున్నరు కాబట్టి తాము ఈ సంస్కరణలను వ్యతిరేకించామని తెలిపారు. తెలంగాణలో వ్యవసాయస్థిరీకరణ జరగాలి... రైతులు ధనవంతులు కావాలి అనేది తన ఆకాంక్ష అని కేసీఆర్ పేర్కొన్నారు.